Ram Charan: రామ్ చరణ్‌కు.. మరో అరుదైన గౌరవం
ABN, Publish Date - Sep 19 , 2025 | 06:19 PM
మెగా పవర్ స్టార్ పేరు మరోసారి ఆల్ ఓవర్ ఇండియా మార్మోగిపోతుంది. నేషనల్ లెవెల్ లో ఆయనకు తాజాగా దక్కిన గుర్తింపు పట్ల అభిమానులు తెగ ఖుషి అయిపోతున్నారు. అదేంటి ప్రస్తుతం ఆయన సినిమాలేవి కూడా లేవు కదా మరి వారి ఆనందానికి కారణమేంటని అనుకుంటున్నారా!?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కు మరో అరుదైన గౌరవం దక్కింది. భారతదేశంలో తొలిసారిగా జరగనున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (Archery Premier League) కు ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ జాతీయ ఆర్చరీ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అక్టోబర్ 2 నుంచి 12వ తేదీ వరకు ఈ అరంగేట్రం ఏపీఎల్ (APL) జరగనుంది.
ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌గా నిర్వహించబడే ఈ టోర్నమెంట్‌లో దేశంలోని పురుష, మహిళా కాంపౌండ్, రికర్వ్ ఆర్చర్లతో పాటు వివిధ దేశాల నుంచి ఆర్చర్లు పాల్గొననున్నారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీల నుంచి 36 మంది భారత టాప్ ఆర్చర్లు, 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు పోటీపడనున్నారు.
ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో భాగం కావడం గర్వంగా ఉందని రామ్ చరణ్ తెలిపారు. ఈ లీగ్ భారత ఆర్చర్లకు అంతర్జాతీయ వేదికగా మాత్రమే కాకుండా, గ్లోబల్ స్పాట్‌లైట్‌లో మెరిసే అవకాశాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. దేశంలోని వివిధ గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్చర్లకు తమ ప్రతిభను నిరూపించుకునే వేదికగా ఏపీఎల్ ఉపయోగపడనుందని జాతీయ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు అర్జున్ ముండా తెలిపారు. రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం వల్ల దేశంలోని యువత ఆర్చరీ పట్ల మరింత ఆకర్షితులవుతారని ఆయన అన్నారు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక లీగ్‌కు రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక కావడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: The Raja Saab: సాంగ్ కోసం మరో మాసీవ్ సెట్
Read Also: Mahavathar Narasimha: ఫర్‌ఫెక్ట్ టైంలో.. ఓటీటీలో దిగింది! ఇక ఇండ్లన్నీ మటాషే