The Raja Saab: ‘ది రాజా సాబ్’ సాంగ్ కోసం.. మరో మాసీవ్ సెట్

ABN , Publish Date - Sep 19 , 2025 | 06:14 PM

మొదట్లో చిన్న సినిమా అంటూ ప్రచారం చేశారు కానీ.. ఖర్చు మాత్రం ఓ రేంజ్ లో పెట్టేస్తున్నారు రెబల్ స్టార్ మూవీ మేకర్స్.. దేనికైనా సరే నో చెప్పకుండా డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు... అతిపెద్ద సెట్స్ వేస్తూ అభిమానుల అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తున్నారు..

The Raja Saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పీడ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఒక వైపు భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో బాక్సాఫీస్‌ను కుదిపేస్తూనే, మరోవైపు వైవిధ్యమైన కథలతో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం అతను మారుతి (Maruthi) దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమాతో పాటు, హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ‘ఫౌజీ’ (Fauji) మరో భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. వీటిలో ‘ది రాజా సాబ్’ షూటింగ్ దాదాపు ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది. ఇది ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం వేసిన సెట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి.


‘ది రాజా సాబ్’ సినిమా ప్రారంభంలో, మారుతి డైరెక్టర్‌తో ప్రభాస్ (Prabhas) సినిమా చేయడంపై అభిమానుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌ను ఆపేయాలని, క్యాన్సిల్ చేయాలని కూడా ప్రచారం చేశారు. కానీ, ప్రభాస్ మాత్రం కథ మీద, మారుతీ విజన్ మీద నమ్మకంతో ముందుకు వెళ్లాడు. ఫలితంగా, మారుతి ప్రభాస్‌ను ఒక స్టైలిష్, వింటేజ్-మోడరన్ అవతార్‌లో ప్రెజెంట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడు, ఇది అతని కెరీర్‌లో ఫస్ట్ టైమ్. ఈ హారర్, కామెడీ, థ్రిల్లర్ జోనర్ ప్రభాస్‌కు కొత్త ఇమేజ్‌ను తెచ్చిపెడుతోంది. అయితే ఈ సినిమా కోసం డైరెక్టర్ మారుతి అతిపెద్ద సెట్స్ వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

'ది రాజా సాబ్' కోసం హైదరాబాద్‌లోని అజీజ్ నగర్‌లో హవేలి సెట్‌ను నిర్మించారు.‌ దాదాపు 40,000 చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ సెట్, భారతదేశంలో హారర్ జోనర్ కోసం నిర్మించిన అతిపెద్ద సెట్‌గా రికార్డ్ సృష్టించింది. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ నాయర్ (Suresh Nair) ఈ సెట్‌ను హాలీవుడ్ స్థాయిలో డిజైన్ చేశారు, ప్రతి డీటెయిల్‌ను ఫైన్‌గా తీర్చిదిద్దారు. నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, సినిమాను గ్రాండ్ స్కేల్‌లో తీస్తున్నారు. ఇదే కాదు మరో పాట కోసం కూడా భారీ సెట్ నే వేశారట మేకర్స్. వాస్తవానికి తమిళనాడులోని కుంభకోణం లో ఓ పాట తీద్దామనుకున్నారట కానీ ఇప్పుడు దాన్ని కూడా సెట్‌ గా అజీజ్ నగర్‌లోని స్టూడియోలో నిర్మిస్తున్నారని టాక్. ‘ది రాజా సాబ్’ 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది, ఇది ప్రభాస్ అభిమానులకు ఒక సినిమాటిక్ ఫీస్ట్‌గా ఉండనుంది.

Read Also: Nag Ashwin: జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు.. కౌంటర్‌ దీపికకేనా..

Read Also: Jr NTR Accident on AD Shooting: జూనియర్‌ ఎన్టీఆర్‌కు ప్రమాదం.. ఏమైందంటే..

Updated Date - Sep 19 , 2025 | 07:29 PM