సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rajini and Pawan: తలైవా ట్వీట్‌కు.. పవన్‌ రిప్లై.. సరదాగా..

ABN, Publish Date - Aug 17 , 2025 | 07:00 PM

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) ఓ పొలిటికల్‌ తుపాను అని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ట్వీట్‌ చేయడం, దానికి పవన్‌ కల్యాణ్‌ రిప్లై ఇవ్వడం ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటోంది.

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) ఓ పొలిటికల్‌ తుపాను అని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) ట్వీట్‌ చేయడం, దానికి పవన్‌ కల్యాణ్‌ రిప్లై ఇవ్వడం ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటోంది. తలైవా రజనీకాంత్‌  నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే! దానిపై రజనీకాంత్‌ ఆదివారం స్పందించారు. ‘ఏపీ ఉప ముఖ్యమంత్రి, నా సోదరుడు, పొలిటికల్‌ తుపాను పవన్‌ కల్యాణ్‌ గారు.. ప్రేమతో మీరు చెప్పిన విషెస్‌కు ఉప్పొంగిపోయా. మీ సందేశాన్ని గౌరవంగా భావిస్తున్నా. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని రజనీకాంత్‌ పేర్కొన్నారు.

రజనీ ట్వీట్‌కు పవన్‌ కల్యాణ్‌ స్పందిస్తూ.. ‘బిగ్‌ బ్రదర్‌ రజనీకాంత్‌.. మీ అభిమానం, ఆశీస్సులకు కృతజ్ఞుడిని.. మీ మాటలు నా హృదయాన్ని హత్తుకున్నాయి. మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా’’ అని పేర్కొన్నారు. పవన్‌తోపాటు ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, నటుడు కమల్‌హాసన్‌ తదితరులు రజనీకాంత్‌కు సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ చెప్పిన సంగతి తెలిసిందే!  

ALSO READ: Pragathi: అది ఈ నొప్పులు, బాధల కన్నా గొప్పది

Kasarla Shyam: కాసర్ల శ్యామ్‌.. నేషనల్ అవార్డు సీక్రెట్ అదే

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ బర్త్ డే.. రాజాసాబ్ స్పెషల్ పోస్టర్ చూశారా

The Bads of Bollywood: ఆర్యన్ ఖాన్ ఫస్ట్ మూవీ గ్లింప్స్‌

Maareesan: ఓటీటీకి వచ్చేస్తున్న ఫహాద్ ఫాజిల్ కొత్త సినిమా .. ఎందులో చూడొచ్చంటే

Updated Date - Aug 17 , 2025 | 07:19 PM