Nidhhi Agerwal: నిధి అగర్వాల్ బర్త్ డే.. రాజాసాబ్ స్పెషల్ పోస్టర్ చూశారా
ABN , Publish Date - Aug 17 , 2025 | 03:33 PM
అందాల హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal).. ఇప్పుడిప్పుడే ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తుంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ హిట్ తరువాత అమ్మడు ఇప్పటివరకు అలాంటి హిట్ అందుకున్నది లేదు.
Nidhhi Agerwal: అందాల హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal).. ఇప్పుడిప్పుడే ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తుంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ హిట్ తరువాత అమ్మడు ఇప్పటివరకు అలాంటి హిట్ అందుకున్నది లేదు. మంచి అవకాశాలను కూడా దక్కించుకున్నది లేదు. ఇక చాలాకాలం ఎదురుచూసిన హరిహర వీరమల్లు (HariHara Veeramallu) ఈ ఏడాది రిలీజ్ అయ్యింది. సినిమా ఎలా ఉన్నా నిధి నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాకపోతే హిట్ ఖాతా మాత్రం తెరవలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ చిన్నదాని ఆశలన్నీ ది రాజాసాబ్ (The Rajasaab) పైనే పెట్టుకుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంతే రాజాసాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తుండగా సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
ఇక నేడు నిధి అగర్వాల్ పుట్టినరోజు. దీంతో ఉదయం నుంచి నిధికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా నిధికి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా ది రాజాసాబ్ టీమ్ ఒక కొత్త పోస్టర్ తో నిధికి బర్త్ డే విషెస్ తెలిపింది. ఈ సినిమాలో నిధి ఒక నన్ గా కనిపిస్తుంది. ఈ పోస్టర్ లో వైట్ డ్రెస్ లో జీసెస్ కు దండం పెడుతూ కనిపించింది. 'ఎంతో అందమైన, టాలెంట్ ఉన్న నిధి అగర్వాల్ కు ది రాజాసాబ్ టీమ్ తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు. నిధి పాత్ర కింగ్ సైజ్ లాంటి కథకు మరింత గ్రేస్ ను తీసుకొస్తుంది. ఆమె పాత్ర చాలా లోతుగా ఉండబోతుంది' అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.
Ghattamaneni Bharathi: మహేష్ బాబు వారసురాలి టాలీవుడ్ ఎంట్రీ షురూ
Bobby Deol: స్టార్ హీరోయిన్ నోటి నుంచి గబ్బు వాసన.. ముద్దు పెట్టనన్న యానిమల్ విలన్