Rajendra Prasad: చాలా పెద్ద మాట అన్నావ్ నటకిరీటి.. అవ్వకపోతే ఏంటి నీ పరిస్థితి

ABN , Publish Date - Oct 29 , 2025 | 04:17 PM

స్టేజిల మీద గొప్పలు చెప్పడం ఈ మధ్య బాగా ఎక్కువ అయ్యిపోయింది. సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే కానీ, మైక్ ముందు ఓవర్ కాన్ఫిడెన్స్ గా మాట్లాడడం మాత్రం ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది.

Rajendra Prasad

Rajendra Prasad: స్టేజిల మీద గొప్పలు చెప్పడం ఈ మధ్య బాగా ఎక్కువ అయ్యిపోయింది. సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే కానీ, మైక్ ముందు ఓవర్ కాన్ఫిడెన్స్ గా మాట్లాడడం మాత్రం ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఈ సినిమా హిట్ అవ్వకపోతే టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం. సినిమా బాగోకపోతే చెప్పుతో కొట్టండి. కాలర్ ఎగరేసి చెప్తున్నా సినిమా హిట్ అవుతుంది. ఇలాంటి మాటలు వినడానికి బావుంటాయి కానీ, ఒకసారి సినిమా చూసాక అవేమి లేకపోతే మాత్రం దానికన్నా అవమానం ఇంకొకటి ఉండదు. సోషల్ మీడియాలో ట్రోల్స్ కు బలి కావలసిందే.

ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. వివాదాలు మనకు కొత్త కాదు.. మైక్ దొరికితే మనం ఏది మాట్లాడటమే మనకే తెలియదు. ఎన్నిసార్లు ట్రోల్స్ అయినా మనకు పట్టింపు లేదు అనుకుంటాడో ఏమో.. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్.. మరోసారి మైక్ ముందు సంచలన వ్యాఖ్యలే చేశాడు. మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాస్ జాతర. నాగవంశీ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ గతరాత్రి మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యాడు. ఇక స్టేజ్ మీద రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. 'చాలాకాలం తరువాత ఒక అద్భుతమైన మాస్ సినిమా.. అన్ని మసాలాలు ఉన్న మాస్ సినిమా ఈ మధ్యకాలంలో ఎప్పుడు రాలేదు. ఈ సినిమాలో ఏం ఉంది.. ఏం లేదు నేను చెప్పను. అది మీరు థియేటర్ లోనే చూడాలి. ఈ సినిమా చూసి మీరు షాక్ అవ్వకపోతే నేను సినిమా ఇండస్ట్రీ నుండి వెళ్లిపోతా' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నట కిరీటి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

తమ సినిమా మీద కాన్ఫిడెంట్ ఉండడంలో తప్పు లేదు. కానీ, ఇలా అనవసరమైన ప్రమాణాలు చేసి.. సినిమాపై హైప్ తీసుకోస్తారు బానే ఉంటుంది. కానీ, ఒకవేళ కనుక సినిమా అటు ఇటు అయితే.. న రాజేంద్ర ప్రసాద్ పరిస్థితి ఏంటి..? నిజంగానే ఆయన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాడా.. ? ఇవన్నీ ప్రమోషన్స్ జిమిక్కులు.. ఇలా మాట్లాడితే ఎక్కువ హైప్ దొరుకుతుందని అంటారు అంతే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి మాస్ జాతర కనుక మంచి రెస్పాన్స్ అందుకోకపోతే నట కిరీటి పరిస్థితి ఏంటో చూడాలి.

Malavika Mohanan: చిరుతో రొమాన్స్.. మాళవిక రియాక్షన్ ఇదే

Bad boy Karthik: అంద‌మైన ఫిగ‌ర్ నువ్వా.. అంటున్న ‘బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌’

Updated Date - Oct 29 , 2025 | 05:02 PM