Malavika Mohanan: చిరుతో రొమాన్స్.. మాళవిక రియాక్షన్ ఇదే
ABN , Publish Date - Oct 29 , 2025 | 03:08 PM
ఇండస్ట్రీ అన్నాకా పుకార్లు సర్వ సాధారణమే. రిలేషన్స్ విషయంలో కొన్ని పుకార్లు వస్తే.. ఛాన్స్ లు అందాయని ఇంకొన్ని పుకార్లు వస్తాయి. కొంతమంది ఈ పుకార్లను లైట్ తీసుకుంటారు.
Malavika Mohanan: ఇండస్ట్రీ అన్నాకా పుకార్లు సర్వ సాధారణమే. రిలేషన్స్ విషయంలో కొన్ని పుకార్లు వస్తే.. ఛాన్స్ లు అందాయని ఇంకొన్ని పుకార్లు వస్తాయి. కొంతమంది ఈ పుకార్లను లైట్ తీసుకుంటారు. మరికొంతమని ఎప్పటికప్పుడు క్లారిటీ ఇవ్వకపోతే కష్టం అనుకోని.. పుకారు వచ్చిన వెంటనే స్పందిస్తూ ఉంటారు. అలా స్పందించేవారిలో మలయాళ భామ మాళవిక మోహనన్(Malavika Mohanan) ముందు ఉంటుంది.
మాళవిక మోహనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా సినిమాలు పక్కన పెడితే.. అమ్మడు ది రాజాసాబ్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమవుతుంది. ప్రభాస్ తో రొమాన్స్ చేస్తున్న బ్యూటీ కావడంతో.. ఫ్యాన్స్ కు ఈ చిన్నది గా మారింది. ఇక అమ్మడు కూడా తన అందచందాలను అస్సలు దాచుకోకుండా అభిమానుల ముందు ఆరబోస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో మాళవికకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండనే ఉంది.
ఈ మధ్యనే హృదయపూర్వం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది మాళవిక. మోహన్ లాల్ తో కలిసి నటించడం అంటే మాటలు కాదు. కానీ, ఈ భామ అలవోకగా నటించి మెప్పించింది. ఆ నటన చూసే మాళవికకు మెగా ఛాన్స్ వచ్చిందనిన వార్తలు వినిపించాయి. బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న రెండో చిత్రం మెగా 158. వాల్తేరు వీరయ్య సినిమా తరువాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో మెగా158 పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కీలక పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ విలన్ గా సెలెక్ట్ అయ్యాడని వార్తలు వినిపించాయి. అంతేకాకుండా మాళవిక మోహనన్.. చిరుతో రొమాన్స్ చేస్తుందని టాక్ నడిచింది. ఇక ఈ రూమర్స్ పై ఎట్టకేలకు మాళవిక స్పందించింది. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని ఆమె తెలిపింది.
' హాయ్ గయ్స్.. బాబీ సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 158 సినిమాలో నేను కూడా భాగం అయ్యినట్లు చాలా వార్తలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. నా కెరీర్ లో చిరంజీవి సార్ తో నటించాలని నాకు కోరిక ఉంది. కానీ, ఇప్పుడైతే ఈ సినిమాలో నేను నటించడం లేదని, అవన్నీ ఫేక్ వార్తలని మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ రూమర్స్ కు చెక్ పడినట్లయింది. మరి మాళవిక కాకపోతే మెగా 158 లో చిరుతో రొమాన్స్ చేసే భామ ఎవరై ఉంటారో చూడాలి.
Tollywood: ఎంటర్ టైన్ మెంట్ హీరోలతో మల్టీస్టారర్
Nithiin : రెండు సినిమాలు వదిలేసి... డ్యుయల్ రోల్ వైపు మొగ్గు...