Mirai: 'మిరాయ్' స‌క్సెస్‌.. హీరో, డైరెక్టర్‌కు కార్ గిఫ్ట్

ABN , Publish Date - Sep 17 , 2025 | 12:32 PM

'మిరాయ్' హీరో, డైరెక్టర్లకు వారు కోరిన కారును గిఫ్ట్ గా ఇస్తానని చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు. విజయవాడలో జరిగిన సక్సెస్ మీట్ లో ఆయన ఈ హామీని ఇచ్చారు.

Teja Sajja - Karhtik Ghattamaneni

యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) తో కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamanini) తెరకెక్కించిన 'మిరాయ్' (Mirai) సినిమా వంద కోట్ల క్లబ్ ను చేరిపోయింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) విజయవాడలో మూవీ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో రచయిత బీవీఎస్ రవి (BVS Ravi) నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ను ఓ ప్రశ్న వేశారు. *ఇంత గ్రాండ్ సక్సెస్ ను అందించిన హీరో తేజ సజ్జాకు మీరు ఏ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు?' అని. దానికి సమాధానంగా అదే వేదికపై టీజీ విశ్వప్రసాద్... 'తేజ సజ్జాకు అతను కోరిన కారును గిఫ్ట్ ఇస్తానని, అలానే ఈ సినిమాకు రియల్ హీరో అయిన కార్తీక్ ఘట్టమనేని కి సైతం కారును బహూకరిస్తాన'ని చెప్పారు. దాంతో స్టేజ్ మీద ఉన్న తేజ సజ్జా మైక్ చేతిలోకి తీసుకుని... 'మీతో గిఫ్ట్ ఇప్పిస్తున్న సందర్భంగా రైటర్ రవి గారూ... రెండు టైర్స్ ను తీసేసుకుం టారేమో' అని చమత్కరించాడు. 'మిరాయ్' సినిమాకు యు.ఎస్.లోనూ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఈ సినిమా 2.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.

WhatsApp Image 2025-09-17 at 12.10.43 PM.jpeg


తమకు సక్సెస్ ఇచ్చిన హీరోలకు, డైరెక్టర్లకు నిర్మాతలు లక్షల విలువ చేసే కార్లను గిఫ్ట్స్ గా ఇవ్వడం కొంతకాలంగా సినిమా రంగంలో జరుగుతోంది. ఆ మధ్య 'జైలర్8 మూవీ సక్సెస్ అయినప్పుడు కూడా నిర్మాతలు రజనీకాంత్ కు కోట్ల విలువ చేసే కారును గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో గ్రాండ్ విక్టరీలను ఏ నిర్మాత అందుకోకపోవడంతో... ఆ సంప్రదాయం కాస్తంత మరుగున పడింది. ఇప్పుడు మళ్ళీ 'మిరాయ్' మూవీలో కార్ల బహుమతి అనేది తిరిగి మొదలైందని అనుకోవచ్చు.

Also Read: Good Bad Ugly: ఇళ‌యరాజా దెబ్బ‌.. నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా అవుట్

Also Read: Happy Birthday Modi Ji: ప్రధాని మోదీకి.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు

Updated Date - Sep 17 , 2025 | 02:48 PM

Mirai Review: తేజ స‌జ్జా.. మిరాయ్ సినిమా రివ్యూ

Mirai Making: సూపర్‌ యోధగా తేజ.. చుక్కలు చూపిస్తున్నారుగా..  

Teja Sajja - Prasanth Varma: మనకి ఏం కావాలన్నా మనమే అడిగి తీసుకోవాలి..

Teja Sajja: అన్నీ కష్టాలే.. ఓ పెద్ద వ్యక్తే నమ్మించి మోసం చేశాడు..

Teja Sajja: 'మిరాయ్'లో వైబ్ సాంగ్ ఉండదా...