Happy Birthday Modi Ji: ప్రధాని మోదీకి.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు
ABN , Publish Date - Sep 17 , 2025 | 10:48 AM
భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజును జరుపుకుంటున్న సందర్భంగా సినిమా ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీకి సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశాన్ని ప్రగతి పథంలో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడం కోసం మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలని కోరుకుంటున్నాం అంటూ చిరంజీవి ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమపాత్రమైన భారతదేశాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడం కోసం మీరు ప్రశాంతమైన జీవితాన్ని, చక్కని ఆరోగ్యాన్ని, అద్భుతమైన శక్తిని పొందాలని కోరుకుంటున్నాను అని రజనీకాంత్ శుభాకాంక్షలు చెప్పారు. అలానే మోదీతో తనకున్న అనుబంధాన్ని ప్రముఖ నటుడు, ఎ.పి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో వీడియో రూపంలో పోస్ట్ చేశారు.
మీ జీవన ప్రయాణం, మీలోని నాయకత్వ లక్షణాలు నాలాంటి లక్షలాది మందికి స్ఫూర్తి అని మంచు విష్ణు తన శుభాకాంక్షలలో పేర్కొన్నాడు. ఈ దేశానికి సేవ చేసే మీరు మరింత ఆరోగ్యాన్ని, శక్తిని పొందాలని ఈ 75వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని రామ్ చరణ్ తెలిపాడు. అలానే ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ, మాస్ట్రో ఇళయరాజా, నటి, నిర్మాత ఖుష్బూ, బాలీవుడ్ నటి, దర్శకురాలు కంగనా రనౌత్, రాధికా శరత్ కుమార్, పాయల్ ఘోష్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. యువ కథానాయకుడు ఆది సాయికుమార్ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియచేస్తూ పెట్టిన ఫోటో అందరి ఆకట్టుకుంటోంది.