సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Priyanka Chopra: 'ఎస్‌ఎస్‌ఎంబీ 29'.. ప్రియాంక ఏం చేస్తుందంటే..

ABN, Publish Date - Aug 30 , 2025 | 04:19 PM

మహేశ్‌బాబు(mahesh babu), రాజమౌళి (SS rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే.

Priyanka Chopra

మహేశ్‌బాబు(mahesh babu), రాజమౌళి (SS rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. అంతే కాదు ఈ సినిమా అప్‌డేట్‌ కోసమూ అంతే ఆతురగా చూస్తారు. ఈ సినిమాకు సంబంధించి ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్‌ అయిపోతుంది. అధికారికంగా చిత్ర బృందం ఏ అప్‌డేట్‌ ఇవ్వకపోయినా ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దక్షిణాఫ్రికాలో జరుగుతోంది. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న నటి ప్రియాంక చోప్రా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. దాంతో ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. దక్షిణ ఆఫ్రికాలోని నేచర్‌ను తన కెమెరాలో బంధించి ఆ ఫొటోలు ఇన్‌స్టాలో షేర్‌ చేశారు ప్రియాంక చోప్రా. ఆ ఫొటోలు చూసిన వారంతా ఆ ప్రాంతాల్ని గుర్తు పడుతూ ‘మీరు కెన్యాలో ఉన్నారా?’, ‘ఇది ఉత్తర ఆఫ్రికాలో తీసిన ఫొటోస్‌ కదా’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. నెటిజన్లు మాత్రమే కాదు మహేశ్‌ భార్య నమ్రత శిరోద్కర్‌ కూడా దీనిపై రియాక్ట్‌ అయ్యారు. లవ్‌ సింబల్‌ ఎమోజీలను కామెంట్‌ చేశారు.

మహేశ్‌ పుట్టినరోజు ఈ సినిమాకు సంబంధించిన బిగ్‌ అప్‌డేట్‌ వస్తుందని అభిమానులు భావించారు. కానీ ఓ పోస్టర్‌తో సరిపెట్టారు రాజమౌళి. అయితే నవంబర్‌లో అప్‌డేట్‌ ఇస్తామని ప్రకటించారు. అయితే నవంబర్‌లో హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు టాక్‌ నడుస్తోంది. డిసెంబర్‌ 19న ఆయన దర్శకత్వం వహించిన ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’ ప్రేక్షకుల ముందుకురానుంది. దీని ప్రమోషన్‌ కోసం జేమ్స్‌ కామెరూన్‌ నవంబర్‌లో ఇండియాకు రాబోతున్నారు. ఆ సమయంలో ఈ సినిమా’ టైటిల్‌ టీజర్‌ను రిలీజ్‌ చేస్తారని తెలిసింది.

ALSO READ: Allu kanakaratnam: అల్లు అరవింద్‌కు మాతృ వియోగం

 Kenisha: రవి మోహన్‌ ప్రతిభ ప్రపంచానికి తెలియాలి

Joy Crizildaa: గర్భిణిని చేసి మోసం చేశాడు..

Updated Date - Aug 30 , 2025 | 04:31 PM