Raviteja: రవితేజకు.. హీరోయిన్ సెట్ అయింది! నిరీక్షణ ఫలించింది
ABN , Publish Date - Dec 08 , 2025 | 08:57 AM
రవితేజ ప్రస్తుతం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో బిజీగా ఉన్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.
రవితేజ (Raviteja)ప్రస్తుతం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో బిజీగా ఉన్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. తదుపరి శివ నిర్వాణ (Shiva nirvana) దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు మాస్ మహారాజా. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల ఈ చిత్రం గురించి పలు రూమర్స్ వచ్చాయి. ఇందులో ఆరుగురు హీరోయిన్లు ఉంటారంటూ వచ్చిన వార్తల్ని చిత్ర బృందం ఖండించింది.

ఇప్పుడు హీరోయిన్ వేట పూర్తయిందని తెలిసింది. ఇందులో రవితేజ సరసన హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్‌ను Priya bhavani shankar)ఎంపిక చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న టాకీ పార్ట్ చిత్రీకరణలో ఆమె పాల్గొంటున్నట్లు సమాచారం. ఆసక్తికర కథాంశం, థ్రిల్లింగ్ ఎలిమెంట్‌తో తెరకెక్కుతున్న చిత్రమని తెలుస్తోంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రియా భవాని శంకర్ తెలుగులో భీమా, కళ్యాణం కమనీయం చిత్రాల్లో నటించారు
ALSO READ: SS Rajamouli: 'వారణాసి లీక్స్'.. రాజమౌళి నెక్ట్స్ సినిమా కన్ఫర్మ్?
Rashmika Mandanna: మరి నీకు లేని సిగ్గు నాకెందుకురా వెధవ..
అనంతపురం పిల్ల.. ఎద అందాలతో అల్లాడిస్తుందిగా