Rashmika Mandanna: మరి నీకు లేని సిగ్గు నాకెందుకురా వెధవ..
ABN , Publish Date - Dec 07 , 2025 | 08:32 PM
ఈ ఏడాది మొత్తం రష్మిక(Rashmika Mandanna) నామధేయమే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అమ్మడు ఏది పట్టుకున్నా బంగారంగానే మారిపోయింది
Rashmika Mandanna: ఈ ఏడాది మొత్తం రష్మిక(Rashmika Mandanna) నామధేయమే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అమ్మడు ఏది పట్టుకున్నా బంగారంగానే మారిపోయింది. ఇక ఈ ఏడాది చివరిలో కూడా నేషనల్ క్రష్.. ది గర్ల్ ఫ్రెండ్ (The Girl Friend) సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక, దీక్షిత్ శెట్టి జంటగా నటించారు. ఎన్నో అంచనాల నడుమ నవంబర్ 7 న రిలీజ్ అయ్యిన ది గర్ల్ ఫ్రెండ్ పాజిటివ్ టాక్ అందుకొని భారీ హిట్ అందుకుంది.
ఇక ఈ సినిమాలో భూమా దేవిగా రష్మిక నటన నెక్స్ట్ లెవెల్ అయితే ఆమెకు ధీటుగా విక్రమ్ పాత్రలో దీక్షిత్ శెట్టి అదరగొట్టేశాడు. థియేటర్ లో రచ్చ చేసిన ఈ సినిమా గత శుక్రవారం ఓటీటీలో అడుగుపెట్టింది. నెట్ ఫ్లిక్స్ లో ది గర్ల్ ఫ్రెండ్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే. ఇక ఓటీటీలో కూడా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం విశేషం. థియేటర్ లో మిస్ అయినవారందరూ కూడా ఓటీటీలో వీక్షించి సోషల్ మీడియా ద్వారా రష్మికను, రాహుల్ రవీంద్రన్ ను ప్రశంసిస్తున్నారు.
డైరెక్టర్ రాహుల్ సైతం నెటిజన్స్ తన సినిమాపై వచ్చే ప్రతి పోస్ట్ కి రిప్లై ఇస్తూ మరింత హైప్ పెంచుతున్నాడు. తాజాగా ఒక నెటిజన్.. సినిమా అంతా బావుంది. రష్మిక క్లైమాక్స్ లో ఒంటినిండా రంగులతో కనిపిస్తుంది. ఆ లుక్ కి పర్టిక్యులర్ గా రీజన్ ఏమైనా ఉందా.. ? లేక అర్జున్ రెడ్డి కనై, వేరే సినిమాతో కనెక్షనా.. ? అది చాలా పవర్ ఫుల్ ఇమేజ్' అని అడగ్గా దానికి రాహుల్ స్పందించాడు.
'లేదు మిత్రమా... దీనికి అర్జున్ రెడ్డితో కానీ, వేరే ఏ సినిమాతోనూ సంబంధం లేదు. విక్రమ్ ఈ రంగులు/పెయింట్‌లను ఆమె (భూమా) ను సిగ్గుపడేలా, అవమానించడానికి ఉపయోగిస్తాడు. ఆమె అప్పుడు దానిని స్వీకరించడం నేర్చుకుంది. ఆ రంగులు తనలో ఒక భాగమని తెలుసుకుంది. అది తనను మరింత బలంగా మారేలా చేశాయి. ఇంట్రావర్ట్ అయిన ఒక అమ్మాయి.. కాలేజ్ లో ఎప్పుడు మాట్లాడని ఆమె.. అందరి ముందు ఈ రంగులతో నిలబడి మాట్లాడడానికి ఏ మాత్రం సంకోచించదు. తనను అవమానించినవాడిని నిలదీయడానికి.. మరి నీకు లేని సిగ్గు నాకెందుకురా వెధవ అన్న పాయింట్ ని విజువల్ చూపించడానికి మాత్రమే ఆ కలర్స్ ని వాడాము' అని చెప్పుకొచ్చాడు.