సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pawan Kalyan: ఒక డిప్యూటీ సీఎం కత్తి పట్టుకొని వస్తే ఊరుకుంటారా..

ABN, Publish Date - Sep 21 , 2025 | 10:09 PM

ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అని ఆనందపడేలోపు వరుణుడు మొత్తం నాశనం చేసేశాడు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓజీ (OG) ఈవెంట్ ఎంత ఘనంగా జరుగుతుంది

OG

Pawan Kalyan: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అని ఆనందపడేలోపు వరుణుడు మొత్తం నాశనం చేసేశాడు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓజీ (OG) ఈవెంట్ ఎంత ఘనంగా జరుగుతుంది అనుకుంటే వర్షం వలన అరగంటలోనే క్లోజ్ చేసేశారు. అయినా ఇందులో జరిగిన మంచి ఏంటి అంటే.. వర్షం అయినా కూడా పవన్ గట్టి స్పీచ్ ఇచ్చాడు. మునుపెన్నడూ లేని విధంగా పవన్ లుక్.. స్పీచ్ ఉండడం అభిమానులను అలరించింది.


ఇక ఈ ఈవెంట్ లో పవన్ మాట్లాడుతూ.. సుజీత్ వలనే తానూ ఇలా రెడీ అయ్యి వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. సాహూ సినిమా తరువాత త్రివిక్రమ్ సుజీత్ ను నాకు పరిచయం చేశాడు. ఒక మంచి కథ ఉంది.. మీకు బావుంటుంది అని చెప్పాడు. సుజీత్ చెప్పేది తక్కువ..కానీ, సినిమా తీసేటప్పుడు మాములుగా లేదు. ఇక ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను డిప్యూటీ సీఎం అన్న విషయం మర్చిపోయా. లేకపోతే ఇలా ఒక డిప్యూటీ సీఎం కత్తి పట్టుకొని వస్తే ఊరుకుంటారా.. ? అదంతా సినిమాలోనే జరుగుతుంది.


ఖుషీ లో ఈ ఖాటానాను ప్రాక్టీస్ చేశా. ఇప్పుడు దాని చుట్టూ కథ అల్లి ఒక సినిమాను తీశారు. ఇక ఇందులో మంచి యాక్షన్ ఉంటుంది. ఇమ్రాన్ హష్మీ.. మంచి నటుడు. ఆయనతో కలిసి నటించడం ఎంతో అద్బుతంగా ఉంది. ఓజీలో ప్రియాంక మోహన్ తో ఒక మంచి లవ్ స్టోరీ ఉంటుంది. ఒక సినిమా కోసం ఇంతమంది అభిమానులు ఎదురుచూడడం ఖుషీ సమయంలో చూశాను. మళ్లీ ఇప్పుడు చూస్తున్నాను. నేను కూడా ఇలా డ్రెస్ వేసుకొని వచ్చాను అంటే అది మీకోసమే.


ఇక రాజకీయాల్లోకి వెళ్ళినా నన్ను మీరు వదల్లేదు. అందుకే నేను ఇలా పోరాడుతున్నాను. దానికి కారణం మీరే. ఒకప్పుడు సినిమాలు తప్ప నాకు వేరే ఆలోచన లేదు. జానీ చేసే సమయంలో కనుక ఇలాంటి దర్శకత్వ టీమ్ కనుక ఉంటే నేను పాలిటిక్స్ కు వచ్చేవాడినే కాదు. సుజీత్ దగ్గరుండి నాకు జపనీస్ నేర్పించాడు. ఇక ట్రైలర్ ఎప్పుడో రిలీజ్ చేద్దామంటే అది ఇంకా అవ్వలేదు.. ఇది ఇంకా అవ్వలేదు అని చెప్తున్నారు.


పవన్ కళ్యాణ్ కు ఏది ఊరికే దక్కలేదు. కానీ, ఇలాంటివన్ని అధిగమించి ఈ నేల 25 న ఓజీతో మీ ముందకు వస్తున్నాం. ఇక ఈ సినిమాలో నటించిన శ్రియా రెడ్డి గురించి చెప్పాలి. ఆమె ఎంతో అద్బుతమైన నటి. ఆమె ఫిట్ నెస్ లెవెల్ చూస్తే మతి పోతుంది. ఆమెతో ఎవరైనా గొడవ పెట్టుకోవాలంటే పదిసార్లు ఆలోచించాలి. ఈ సినిమాలో చాలా బాగా చేసింది. ఆమె నన్ను ఒకటే అడిగింది. భవిష్యత్ లో ఒక సినిమాలో పవర్ ఫుల్ పాత్ర ఇవ్వమంది. కచ్చితంగా శ్రియా తో ఒక సినిమా చేస్తా. సినిమా అందరికీ నచ్చుతుంది' అని ముగించారు.

Pawan Kalyan: కత్తి పట్టుకొని రాయల్ ఎంట్రీ ఇచ్చిన పవన్..

Ananya Pandey: ఆ సౌత్.. హీరోతో న‌టించాలని ఉంది

Updated Date - Sep 21 , 2025 | 10:25 PM