Pawan Kalyan: కత్తి పట్టుకొని రాయల్ ఎంట్రీ ఇచ్చిన పవన్..
ABN , Publish Date - Sep 21 , 2025 | 08:54 PM
వర్షం వచ్చినా.. ఉరుములు వచ్చినా ఓజీ ఈవెంట్ ఆపేది లేదు అన్నట్లు.. ఎల్ బి స్టేడియంలో ఓజీ(OG) కన్సర్ట్ గ్రాండ్ గా జరుగుతుంది.
Pawan Kalyan: వర్షం వచ్చినా.. ఉరుములు వచ్చినా ఓజీ ఈవెంట్ ఆపేది లేదు అన్నట్లు.. ఎల్ బి స్టేడియంలో ఓజీ(OG) కన్సర్ట్ గ్రాండ్ గా జరుగుతుంది. వర్షం లో కూడా పవన్ ఫ్యాన్స్ ఇంచు కూడా కదలకుండా పవన్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఆ ఎదురుచూపులు తెరదింపుతూ పవన్.. ఓజాస్ గంభీర్ గా ఈవెంట్ లో అడుగుపెట్టాడు. ఇప్పటివరకు పవన్ ను ఎప్పుడు చూడని విధంగా ఈ ఈవెంట్ లో నిలబెట్టాడు డైరెక్టర్ సుజీత్.
ఓజీలోని గ్యాంగ్ స్టర్ లుక్ లో బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్.. చేతిలో కత్తి పట్టుకొని పవర్ ఫుల్ గా రాయల్ ఎంట్రీ ఇచ్చాడు. అసలు పవన్ ను ఈ రేంజ్ లో చూస్తామని ఫ్యాన్స్ కూడా అనుకోలేదని చెప్పొచ్చు. స్టేజ్ మీదకు ఎక్కి కత్తి పట్టుకొని తిప్పుతూ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే పేరుకు న్యాయం చేసాడని చెప్పాలి. ఎప్పుడు వైట్ అండ్ వైట్ లో కనిపించే పవన్ ఇప్పుడు బ్లాక్ అండ్ బ్లాక్ లో కనిపించేసరికి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఇది కథ ఎంట్రీ అంటే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Ananya Pandey: ఆ సౌత్.. హీరోతో నటించాలని ఉంది
Rajasekhar: జోరు పెంచిన యాంగ్రీ హీరో.. ఏకంగా మూడు సినిమాల్లో