Ananya Pandey: ఆ సౌత్.. హీరోతో న‌టించాలని ఉంది

ABN , Publish Date - Sep 21 , 2025 | 07:25 PM

బాలీవుడ్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు అనీత్ ప‌డ్డా, జాన్వీ క‌పూర్, సారా అలీఖాన్ పోటీని త‌ట్టుకుంటూ తన ప్రత్యేకతో అందరిని ఆకర్షిస్తోంది అనన్య పాండే .

Ananya Pandey

బాలీవుడ్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు అనీత్ ప‌డ్డా, జాన్వీ క‌పూర్, సారా అలీఖాన్ ఇలా మంచి టాలెంట్ ఉన్న న‌టీమ‌ణులు సెటిల్ అయ్యేందుకు శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నిస్తుండ‌గా వారి నుంచి పోటీని త‌ట్టుకుంటూ తన ప్రత్యేకతో అందరిని ఆకర్షిస్తోంది అనన్య పాండే (Ananya Pandey). చుంకీ పాండే కుమార్తెగా 2019లో “స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2”తో హీరోయిన్‌గా ప్రవేశించిన అనన్య, తనకంటూ ఒక స్టయిల్, వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంది.

ananya pandey

గ్లామర్ విష‌యంలో ఎటువంటి బెరుకు లేని ఈ బ్యూటీ తాజాగా మాల్దీవులు ట్రిప్‌లో ర‌చ్చ ర‌చ్చ చేసింది వ‌చ్చి అక్క‌డ త‌న పొటోషూట్ల‌తో కుర్ర‌కారును గిలిగగింత‌లు పెట్టింది. అధిక శాతం పొదుపైన బ‌ట్ట‌ల్లోనే ద‌ర్శ‌ణ‌మిచ్చే ఈ బ‌క్క బ్యూటీ కేవ‌లం గ్లామ‌ర్ త‌ళుకుల‌కే పరిమితం కావడం కాకుండా కేస‌రి2 వంటి సినిమాల‌తో నటనకు ఆస్కార‌మున్న పాత్ర‌ల్లోనూ మెప్పిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ మిలియ‌న్ల‌లోనే ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది. ఈ అమ్ముడు నిత్యం పెట్టే ఫ్యాషన్, ఫిట్‌నెస్, ఫొటోషూట్స్‌, ట్రావెల్ పోస్ట్‌లు యూత్‌లో క్రేజీ క్రియేట్ చేస్తుంటాయి.

Ananya Pandey

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన “లైగర్” ద్వారా తెలుగు సినిమాలోనూ న‌టించిన‌ అనన్య ఇక్క‌డా మంచి గుర్తింపునే ద‌క్కించుకున్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం తెలుగు సినిమాల‌కు దూరంగా ఉంటోంది. అయితే.. ఇటీవ‌ల ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. హరర్, బయోపిక్ చిత్రాల్లో నటించాలనే కోరికతో ఉన్న‌ట్లు తెలిపింది. అంతేకాదు కేజీఎఫ్ ఫేమ్ హీరో యశ్ (Yash) స‌ర‌స‌న సినిమా చేయాల‌ని ఉందంటూ తెలిపింది. ఇప్పుడీ వార్త సామాజిక మాద్య‌మాల్లో బాగా వైర‌ల్ అవుతోంది.

Ananya Pandey

Updated Date - Sep 21 , 2025 | 07:25 PM