OG: ఓజీ.. ఉస్తాద్ క్రేజీ అప్‌డేట్ వైరల్..
ABN, Publish Date - Jul 31 , 2025 | 12:56 PM
పవన్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్ఝైటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’ . ఈ సినిమా ఫస్ట్‌లుక్, గ్లింప్స్ విడుదల చేసినప్పటి నుంచీ సినిమాకు విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది.
పవన్ ఫ్యాన్స్ (Pawan Kalyan)ఎంతో ఎగ్ఝైటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’ (OG). ఈ సినిమా ఫస్ట్‌లుక్, గ్లింప్స్ విడుదల చేసినప్పటి నుంచీ సినిమాకు విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. ఫస్ట్ గ్లింప్స్‌కు తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే ఏ రేంజ్‌లో హైలైట్ అయింది. అంతకు మించేలా సినిమా ఉంటుందని టీమ్ అంతా ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఆగస్ట్ 3న ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను విడుదల చేయబోతున్నారట. ఫైర్ స్ట్రామ్ అంటూ ఈ వీకెండ్ సోషల్ మీడియా తగలబడిపోవాల్సిందే’ అంటూ ఫ్యాన్ పేజీలో పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి. అయితే తమన్ సంగీత సారథ్యంలో తమిళ నటుడు శింబు పాడిన పాట అని చెబుతున్నారు. దీంతో అభిమానులు ఆ పాట ఎలా ఉండబోతుందో అని ఆతురతగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 25న ఓజీ చిత్రం విడుదల కానుంది. డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ తరుణంలో నిర్మాత ఎస్‌కేఎన్ కూడా ఆ ఆసక్తికర పోస్ట్ చేశారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రం గురించి ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘కళ్ల నిండా లైవ్‌లో ఆయన డాన్స్ చూస్తే కడుపు నిండిన భావోద్వేగం. లిరిక్ బయటకు వచ్చిన రోజున సోషల్ మీడియాలో తగలడిపోద్ది. ఆ రోజు మళ్లీ మాట్లాడుకుందాం’ అని ఎక్స్‌లో ఎస్‌కెఎన్ పోస్ట్ పెట్టారు. ఇది విపరీతంగా వైరల్ అవుతోంది. పవన్‌కల్యాణ్ హీరోగా, రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల రాశీఖన్నా సెట్‌లో అడుగుపెట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ALSO READ: Samantha - Raj nidimoru: సామ్ - రాజ్ మళ్లీ దొరికేశారు.. ఈసారి ఎక్కడంటే..
Vijay sethupathi: లైంగిక వేధింపుల ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన నటుడు..
War 2: ఊపిరి ఊయలలాగా.. అంటూ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది
Kingdom: కింగ్ డమ్ మూవీ రివ్యూ