Vijay sethupathi: లైంగిక వేధింపుల ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన నటుడు..

ABN , Publish Date - Jul 31 , 2025 | 11:56 AM

మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) వచ్చిన లైంగిక ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ ఆరోపణలో పూర్తిగా నిరాధారమైనవని, తాను అలాంటి వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు.

మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) వచ్చిన లైంగిక ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ ఆరోపణలో పూర్తిగా నిరాధారమైనవని, తాను అలాంటి వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు. కొన్ని రోజుల క్రితం రోజా అనే యువతి కోలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ (Sexual Abuse Allegations) బాగా ఉందని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట్‌ చర్చనీయాంశమైంది. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై విజయ్‌ సేతుపతి స్పందించారు. ఈ విషయంలో తనకంటే కుటుంబం ఎంతో బాధ పడిందన్నారు. ఆమెపై తన సిబ్బంది సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ ‘నేనేంటో తెలిసివాళ్లు ఈ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు. వాళ్లకే కాదు నేనేంటో నాకూ తెలుసు. ఇవన్నీ నన్ను ఏ మాత్రం బాధించలేవు. కానీ ఇలాంటి వాటి వల్ల నా కుటుంబం, సన్నిహితులు ఎంతో బాధ పడ్డారు. ‘వీటిని పట్టించుకోకండి’. ఆమె ఫేమస్‌ కావడం కోసం, కాసేపు మీడియాలో పాపులర్‌ కావడం కోసం చేసే పనులివి. అలా ఆమెను కాసేపు ఎంజాయ్‌ చేయనీయండి’ అని నా సన్నిహితులతో చెప్పాను. మేము ఆమెపై సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాం. గత ఏడు సంవత్సరాలుగా నేను ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. ఇప్పటివరకు దేనికీ భయపడలేదు. ఇలాంటివి నన్ను ఏమీ చేయలేవు’ అని విజయ్‌ సేతుపతి అన్నారు.

 
 
గతంలో విజయ్‌పై రమ్య అనే మహిళ ఎక్స్‌లో చేసిన వాఖ్యలివి. ‘తమిళ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ బాగా ఉంది. దీని నా స్నేహితురాలు ఎంతో ఇబ్బంది పడింది. విజయ్‌సేతుపతి కూడా ఆమెను ఇబ్బందిపెట్టారు. ఆమె మానసికంగా కుంగుబాటుకు గురైంది’ అని రమ్య ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. కాసేపటితో ఆమె ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై సేతుపతి అభిమానులు విరుచుకుపడ్డారు. విమర్శలు నిజమైతే పోస్ట్‌ ఎందుకు డిలీట్‌ చేశారని నిలదీశారు. ఆ తర్వాత ఆ మహిళ మరో పోస్‌ట్తఓ క్లారిటీ ఇచ్చింది. అది కోపంలో చేసిన పనని, అంతగా వైరల్‌ అవుతుందనుకోలేదని తెలిపింది. 

ALSO READ: Samantha - Raj nidimoru: సామ్‌ - రాజ్‌ మళ్లీ దొరికేశారు.. ఈసారి ఎక్కడంటే..

OG: ఓజీ.. ఉస్తాద్‌ క్రేజీ అప్‌డేట్‌ వైరల్‌..  

Kingdom: కింగ్ డమ్ మూవీ రివ్యూ

Updated Date - Jul 31 , 2025 | 03:22 PM