NTR: ఎలా ఉండేవాడు.. ఎలా అయ్యిపోయాడు.. దారుణంగా ఎన్టీఆర్ లుక్
ABN, Publish Date - Oct 13 , 2025 | 07:26 PM
నందమూరి నట వారసుడిగా నిన్ను చూడాలని సినిమాతో ఎన్టీఆర్ (NTR) తెలుగుతెరకు పరిచయమయ్యాడు. స్టూడెంట్ నెం 1 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.
NTR: నందమూరి నట వారసుడిగా నిన్ను చూడాలని సినిమాతో ఎన్టీఆర్ (NTR) తెలుగుతెరకు పరిచయమయ్యాడు. స్టూడెంట్ నెం 1 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. మొదటి సినిమా నుంచి ఎన్టీఆర్ బొద్దుగానే కనిపిస్తూ వచ్చాడు. అంత లావుగా ఉన్నా కూడా డ్యాన్స్ లో కానీ, యాక్షన్ సీన్స్ లో కానీ ఎక్కడా తగ్గకుండా ముఖంలో కళతోనే అందరిని మెప్పించాడు. ఇక కంత్రీ సినిమాకు ఎన్టీఆర్ బాగా బరువు తగ్గాడు. బరువు తగ్గినా కూడా ముఖంలో ఆ కళ పోలేదు. ఇక యమదొంగ నుంచి ఎన్టీఆర్ లుక్ చాలా స్టైలిష్ గా మారింది.
సినిమా సినిమాకు తన బరువును పెంచుకుంటూ.. తగ్గించుకుంటూ ఎక్కడా ఫ్యాన్స్ ను అసంతృప్తికి గురికానివ్వకుండా మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం బరువు పెరిగాడు. దేవర కోసం బరువు తగ్గాడు. మళ్లీ వార్ 2 కోసం ఇంకా బరువు తగ్గాడు. కానీ, ఎప్పుడు కూడా ఎన్టీఆర్ ఫేస్ మాత్రం మారలేదు. కానీ, డ్రాగన్ కోసం ఎన్టీఆర్ బరువు తగ్గినప్పుడు.. ఆయన ముఖంలో మునుపటి కళ లేదు. ప్రస్తుతం ఇదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఆందోళన చెందేలా చేస్తుంది. వార్ 2 ప్రమోషన్స్ లో కొద్దిగా ఓకే అనిపించిన ఎన్టీఆర్ ఆ తరువాత బాగా బక్కచిక్కి కనిపించాడు.
అసలు ఎన్టీఆర్ ఏంటి.. ఇలా మారిపోయాడు. సడెన్ గా చూస్తే పేషేంట్ లా కనిపిస్తున్నాడు. ఏమైనా అనారోగ్యంతో సతమతమవుతున్నాడా అనే అనుమానాలు ఎప్పటినుంచో తలెత్తుతున్నాయి. ఇక బావమరిది నితిన్ పెళ్ళిలో మెరిసిన ఎన్టీఆర్ కి.. తాజాగా ఫ్యాన్ తో కలిసి దిగిన ఫోటోలో ఉన్న ఎన్టీఆర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. తాజా ఫొటోలో పింక్ కలర్ కుర్తాలో ఎన్టీఆర్ ని చూస్తే ఆయనకు ఏమైంది.. ? అంత బక్కిచిక్కీ కనిపిస్తున్నాడు అని ప్రశ్నలు వస్తున్నాయి. సన్నగా ఉన్నా కూడా పర్లేదు. కానీ, ముఖంపై నిద్రలేకుండా ఉంటే వచ్చే వాపు కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే చికిత్స తీసుకుంటున్న పేషేంట్ లా కనిపిస్తున్నాడని నెటిజన్స్ అంటున్నారు.
డ్రాగన్ కోసమే ఈ లుక్ నా అంటే అవును అనే మాట వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడు. కానీ, డ్రాగన్ అన్న టైటిల్ కి ఎన్టీఆర్ లుక్ కి అస్సలు సంబంధం లేదు. ప్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కోసం ఇది అనుకుంటే.. మళ్లీ ఎన్టీఆర్ బల్క్ గా మారతాడా.. ? అయితే అది ఎప్పుడు. ఫ్యాన్స్ గా.. మా అన్నను ఇలా చూడలేకపోతున్నాం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఎలా ఉండేవాడు.. ఎలా మారిపోయాడు. సినిమా కోసం అయితే పర్లేదు కానీ, నిజంగా ఆయనేమైనా అనారోగ్య సమస్యతో బాధపడితే మాత్రం త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Rukmini Vasanth: మార్కెట్‌లోకి కొత్త నేషనల్ క్రష్.. రష్మికకు చెక్ పెట్టిన రుక్మిణి
Siddhu Jonnalagadda: కథ వినగానే దర్శకురాలికి కండీషన్ పెట్టా..