Rukmini Vasanth: మార్కెట్‌లోకి కొత్త నేషనల్ క్రష్.. రష్మికకు చెక్ పెట్టిన రుక్మిణి
ABN , Publish Date - Oct 13 , 2025 | 05:57 PM
అనువాద చిత్రమైనా తెలుగునాట సైతం అదరహో అనిపించింది కాంతారా చాప్టర్ వన్ (Kantara Chapter 1).
Rukmini Vasanth: అనువాద చిత్రమైనా తెలుగునాట సైతం అదరహో అనిపించింది కాంతారా చాప్టర్ వన్ (Kantara Chapter 1). రిషభ్ శెట్టి (Rishab Shetty) నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ అందం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది... ఈ సినిమా కన్నడతోపాటు తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లోనూ విడుదలైన వారంలోగానే ఐదు వందల కోట్లకు పైగా పోగేసింది... ఈ సినిమా వసూళ్ళు ఓ సంచలనం అనుకుంటే, ఇందులో నటించిన నాయిక రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) గ్లామర్ సైతం యూత్ ను విశేషంగా ఆకర్షించింది... దాంతో రుక్మిణీని న్యూ నేషనల్ క్రష్ అనడం మొదలెట్టారు...నిజానికి చాలా ఏళ్ళుగా రశ్మిక మందణ్ణను నేషనల్ క్రష్ అంటూ కీర్తిస్తున్నారు జనం... ఇప్పుడు రుక్మిణీ వసంత్ ను సైతం నేషనల్ క్రష్ అని సినీ ఫ్యాన్స్ పిలవడం విశేషంగా మారింది.
ప్రస్తుతం నేషనల్ క్రష్ గా జేజేలు అందుకుంటున్న రశ్మిక, కొందరు అదే టైటిల్ తో కీర్తిస్తున్న రుక్మిణీ వసంత్ ఇద్దరూ కన్నడ భామలే కావడం విశేషం... గతంలోనూ ఎంతోమంది కన్నడ అందాల తారలు దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించి అలరించారు... ఆ నాటి బి.సరోజాదేవి మొదలు మొన్నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్, దీపికా పదుకోణె, అనుష్క శెట్టి, పూజా హెగ్డే వంటి వారందరూ కన్నడ సీమలో కన్ను తెరచిన వారే కావడం విశేషం... వారి బాటలోనే పయనిస్తూ సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ భళా అనిపించిన భామ ప్రస్తుతం రశ్మిక అనే చెప్పాలి... పైగా ఉత్తరం, దక్షిణం అన్న తేడా లేకుండా రశ్మిక రెండు చోట్లా ఘనవిజయాలను చవిచూసింది... అలాంటి రశ్మికకు ఈ మధ్యే విజయ్ దేవరకొండతో నిశ్చితార్థమయిందని తెలియగానే ఫ్యాన్స్ రుక్మిణీ వసంత్ వైపు మనసు పారేసుకుంటున్నారనీ టాక్... అయితే రశ్మిక స్థాయి విజయాలను రుక్మిణి చవిచూడలేదు... అయినా ఆమెను సినీ ఫ్యాన్స్ 'క్రష్' అంటున్నారంటే సమ్ థింగ్ ఈజ్ దేర్ అంటున్నారు పరిశీలకులు.
రశ్మికను కాదని రుక్మిణీ వసంత్ నేషనల్ క్రష్ గా మారుతుందా అన్న అనుమానాలు కొందరిలో పొడసూపక మానలేదు... అయితే కాంతారా చాప్టర్ వన్ ఆల్ ఇండియాలో విజయం సాధించడం వల్ల రుక్మిణీ వసంత్ కు కూడా మంచి గుర్తింపు లభించింది... ఇక యన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సినిమాలోనూ రుక్మిణీ వసంత్ నాయికగా నటిస్తోంది... ఇప్పటికే ఈ మూవీపై ఓ స్పెషల్ క్రేజ్ క్రియేట్ అయింది... వచ్చే యేడాది యన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ వెలుగు చూడనుంది... అది తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందని పరిశీలకుల మాట.
రుక్మిణీ వసంత్ నటించిన తొలి తెలుగు చిత్రం నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రూపొందిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో- ఇది పరాజయం పాలయ్యింది... అయినా రుక్మిణికి క్రేజ్ పెరుగుతోందని అంటున్నారు... కేజీఎఫ్ హీరో యశ్ క్రేజీ ప్రాజెక్ట్ టాక్సిక్ లోనూ రుక్మిణీ వసంత్ హీరోయిన్ కావడం విశేషం... ఈ సినిమాల తరువాత రుక్మిణి మరింత బిజీ కావడం ఖాయమనీ కొందరు జోస్యం చెబుతున్నారు. ఇక కొందరు అయితే రష్మిక పని అయ్యిపోయింది అని కామెంట్స్ కూడా పెడుతున్నారు. మరి ఈ 'న్యూ నేషనల్ క్రష్' ఏ తీరున రాబోయే చిత్రాలతో అలరిస్తుందో చూడాలి.
Siddhu Jonnalagadda: కథ వినగానే దర్శకురాలికి కండీషన్ పెట్టా..
Telusu Kada Trailer: ఆడదానికి ఆ కంట్రోల్ ఇవ్వకూడదు.. అదిరిపోయిన తెలుసు కదా ట్రైలర్