Siddhu Jonnalagadda: కథ వినగానే దర్శకురాలికి కండీషన్ పెట్టా..
ABN , Publish Date - Oct 13 , 2025 | 05:46 PM
ఓ రొమాంటిక్ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు దానికి సిద్థూ అయితేనే న్యాయం చేయగలరనిపించింది.
సిద్థూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) కథానాయకుచి?గా తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’ (Telusu Kada). నీరజ కోన (Neeraja kona) దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా టీమ్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
నీరజ కోన మాట్లాడుతూ ‘ఓ రొమాంటిక్ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు దానికి సిద్థూ అయితేనే న్యాయం చేయగలరనిపించింది’ అని అన్నారు.
Siddhu Jonnalagadda.. 'దీపావళికి చాలా సినిమా పోటీ ఉంది. అది రిస్క్ అయినా రిస్క్ ఉన్నచోటే విజయం ఉంటుంది. నా గత చిత్రం అనుకున్న స్థాయిలో అలరించలేకపోయింది. ఒక సినిమా నన్ను కింద పడేస్తే. ఇంకోటి టాప్‌లో చేర్చుతుందన్నది నా నమ్మకం. ఇక గత ప్రచార చిత్రాలకు, ఈ ట్రైలర్‌కు సంబంధం లేదని అంటున్నారు. అది కావాలని చేసింది కాదు. సినిమా మొదలైనప్పటి నుంచి ప్రచార చిత్రాలు విడుదల చేస్తూ వచ్చాం. షూటింగ్ చేసే క్రమంలో కొన్ని మార్పులు చేశాం. అందుకే అలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ట్రెలర్‌తో కథ చెప్పాలనుకున్నాం.
అయితే టిల్లుకి ఈ సినిమాకు సంబంధం లేదు. ఇందులో దానికి మించిన వినోదం ఉంటుంది. ఇక హీరోయిన్ల విషయానికొస్తే నేను ఇప్పటివరకూ ఇద్దరు హీరోయిన్లతో చేసింది ఒకే సినిమా ‘కృష్ణా అండ్ హిజ్ లీల’. దానిలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ‘టిలు స్వ్కేర్’ అతిథి పాత్రలో మరో హీరోయిన్ కనిపించిందంతే! ఇది లవ్ స్టోరీ కాబట్టి దానికి తగినట్లే రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. ఒక్క ముద్దు సీన్ కూడా ఉండకూడదు అని కథ చెప్పినప్పుడే నీరజకు కండీషన్ పెట్టా. ఇది పూర్తిగా ఫ్యామిలీ సినిమా.
మా టీమ్ అంత ఆడాళ్లే
సిద్ధూ: మా సినిమా టీమ్ లో 16 మంది మహిళలు ఉండేవారు. వాళ్లందరిలో నేను ఒక్కడినే ఉండేవాడిని. సెట్‌లో చాలా ఫన్‌గా ఉండేది. రాశీ ఖన్నా అయితే క్లైమాక్స్‌లో నేను చేయను అని 40 నిమిషాలు సెట్ నుంచి వెళ్లిపోయింది. ‘నా బాయ్‌ఫ్రెండ్ ఇలా చేేస్త నేను అంగికరించను’ అని పక్కకి వెళ్లి కూర్చొంది. ఇది కేవలం పాత్ర అని చెప్పి తీసుకొచ్చాను.
రవితేజతో మల్టీస్టారర్..
గతంలో ఒక సినిమా ప్లాన్ చేశాం. కానీ, అది ఆగిపోయింది. ఒకవేళ మా ఇద్దరికీ సరిపోయే కథ ఉంటే కచ్చితంగా చేస్తాం. జాక్ సినిమాతో లోన్లు తీసుకున్నా. డబ్బు?ని వస్తుంటాయి, పోతుంటాయి. నాకు రికవరీ అనేది ఎమోషనల్‌గా కావాలి. ఫైనాన్షియల్‌గా కాదు.