సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dragon: యన్టీఆర్ - నీల్ మధ్య విభేదాలు ముగిసినట్టేనా..

ABN, Publish Date - Nov 01 , 2025 | 09:46 PM

రాజమౌళి(Rajamouli) సినిమాతో బంపర్ హిట్ కొట్టిన స్టార్ హీరోస్ తరువాత వచ్చే మూవీ ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ను తన 'దేవర'(Devara)తో చెరిపేశారు యంగ్ టైగర్ యన్టీఆర్(NTR).

Dragon

Dragon: రాజమౌళి(Rajamouli) సినిమాతో బంపర్ హిట్ కొట్టిన స్టార్ హీరోస్ తరువాత వచ్చే మూవీ ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ను తన 'దేవర'(Devara)తో చెరిపేశారు యంగ్ టైగర్ యన్టీఆర్(NTR). 'ట్రిపుల్ ఆర్' తరువాత యన్టీఆర్ హీరోగా వచ్చిన 'దేవర' హిట్ గానే నిలచింది. అయితే 'ట్రిపుల్ ఆర్' లా బ్లాక్ బస్టర్ కాదుగా అంటూ కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అలాంటి వారికి తమ హీరో రాబోయే ప్రశాంత్ నీల్ డ్రాగన్ (Dragon) సినిమాతో అసలు సిసలు హిట్ చూపిస్తారని యన్టీఆర్ ఫ్యాన్స్ అన్నారు. అయితే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న డ్రాగన్ మూవీ తరువాత ఆగిపోయింది. యన్టీఆర్, ప్రశాంత్ నీల్ మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తాయని అందువల్లే షూటింగ్ ఆగిపోయిందని టాక్. ఇప్పటివరకు షూట్ చేసిన ఫుటేజ్ యన్టీఆర్ కి నచ్చలేదని, అందుకే విభేదాలు తల్తెతాయని వార్తలు వినిపించాయి.


తాజాగా ఈ విభేదాలకు ఫుల్ స్టాప్ పడినట్లు తెలుస్తోంది. ఇవేమి క్రియేటివ్ డిఫరెన్సెస్ కాదని, కొన్ని టెక్నీకల్ పొరపాట్లు అని సమాచారం. ఏది ఏమైనా ఇప్పుడు అన్నీ సమసిపోయి 'డ్రాగన్' తాజా షెడ్యూల్ నవంబర్ మూడోవారంలో మొదలు కానుందని రూఢీగా తెలుస్తోంది.'డ్రాగన్' తాజా షెడ్యూల్ ఉత్తర యూరప్ లో జరగనుందని తెలుస్తోంది. నవంబర్ మూడోవారంలో ఆరంభమయ్యే షెడ్యూల్ లో యన్టీఆర్, మరికొందరిపై భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించనున్నారట.


యన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. ఈ యేడాది వచ్చిన 'వార్ 2' ఏ మాత్రం అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఎలాగైనా యన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే 'డ్రాగన్' బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగా సినిమాను రూపొందించడానికి ప్రశాంత్ నీల్ సైతం కృషి చేస్తున్నారని యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు. రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడు జనం ముందుకు వస్తుందో చూడాలి.

Star Kids: వారసత్వం వద్దు.. సొంత టాలెంట్ ముద్దు

Lokesh Kanagaraj: హీరోగా మారిన కూలీ డైరెక్టర్.. టైటిల్ ఏంటో తెలుసా

Updated Date - Nov 01 , 2025 | 10:20 PM