Lokesh Kanagaraj: హీరోగా మారిన కూలీ డైరెక్టర్.. టైటిల్ ఏంటో తెలుసా

ABN , Publish Date - Nov 01 , 2025 | 08:30 PM

ఇండస్ట్రీలో హీరోలు.. డైరెక్టర్స్ గా మారారు కానీ, డైరెక్టర్లు.. హీరోలుగా మారడం చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. ఆ కోవలోకే వచ్చాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj).

Lokesh Kanagaraj

Lokesh Kanagaraj: ఇండస్ట్రీలో హీరోలు.. డైరెక్టర్స్ గా మారారు కానీ, డైరెక్టర్లు.. హీరోలుగా మారడం చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. ఆ కోవలోకే వచ్చాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ఖైదీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిన లోకేష్ ఆ తరువాత పరాజయమే ఎరుగని డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక ఈ ఏడాది రజినీకాంత్ తో కూలీ సినిమా తెరకెక్కించి మొదటిసారి ప్లాప్ ను అందుకున్నాడు.

కూలీ సినిమాతో లోకేష్ ఎంత ట్రోల్ అవ్వాలో అంతా ట్రోల్ అయ్యాడు. ఇక ఎప్పటినుంచో లోకేష్ హీరోగా మారాలని ట్రై చేస్తున్న విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు అది నిజమయ్యింది. ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ లాంటి సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ హీరోగా పరిచయం అవుతున్నాడు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

తాజాగా లోకేష్ నటిస్తున్న సినిమా టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు DC అనే టైటిల్ ను ఖరారు చేస్తూ టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో లోకేష్ సరసన హాట్ బ్యూటీ వామికా గబ్బి నటిస్తున్నట్లు తెలిపారు. టీజర్ లో రక్తం నిండిన దేహంతో లోకేష్ నడుచుకుంటూ కనిపించగా.. వామికా తల్లో రోజా పువ్వు పెట్టుకొని, చేతిలో నిరోధ్ తో కనిపించింది.

ఇక ఈ చిత్రంలో లోకేష్.. దేవదాస్ పాత్రలో కనిపిస్తున్నాడని, వామికా చంద్రగా నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. దేవదాస్ అంటే D.. చంద్ర అంటే C .. వీరిద్దరూ పేర్లు కలిపి డీసీ ని టైటిల్ ని పెట్టినట్లు తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి మొదటి సినిమాతోనే లోకేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Sudigali Sudheer: ఆగిన గోట్.. మళ్లీ మొదలైంది

Karthi: కార్తీ.. 'ఆవారా' రీ రిలీజ్! ఎప్పుడంటే

Updated Date - Nov 02 , 2025 | 12:17 AM