NTR: అయ్యా.. అయ్యా.. ఊరమాస్ లుక్ అయ్యా..
ABN, Publish Date - Nov 05 , 2025 | 03:34 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం డ్రాగన్ (Dragon) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.
NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం డ్రాగన్ (Dragon) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతోంది.
అయితే డ్రాగన్ సినిమా మొదలైనప్పుడు ఉన్న ఎన్టీఆర్ లుక్.. ఇప్పుడు ఎన్టీఆర్ లుక్ కు అస్సలు పొంతన లేదు. సడెన్ గా ఎన్టీఆర్ బరువు తగ్గి కనిపించడం అభిమానులను షాక్ కు గురిచేసింది. అసలు ఎన్టీఆర్ కు ఏమైంది..? ఎందుకు ఇలా బక్కచిక్కి కనిపిస్తున్నాడు.. ? ఏదైనా అనారోగ్యమా.. ? లేక వేరే సమస్య అని భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. కానీ, డ్రాగన్ కోసమే ఎన్టీఆర్ బరువు తగ్గాడని సమాచారం.
ఇక ఈమధ్యకాలంలో మరింత బరువు తగ్గి.. ముఖంలో కళనే లేకుండా కనిపించిన ఎన్టీఆర్.. ప్రస్తుతం కోలుకున్నట్లు కనిపిస్తున్నాడు. తాజాగా ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ దర్శనమయ్యింది. గుబురు గడ్డంతో.. నార్మల్ చెక్ షర్ట్ దానిపై బ్లాక్ కోట్ .. బ్లాక్ గాగుల్స్ తో కనిపించాడు. ఇక కెమరాను చూస్తూ.. మీసం మెలేస్తూ నడుస్తుంటే.. పులిలా కనిపిస్తున్నాడు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతకు ముందు కన్నా ఈసారి ఎన్టీఆర్ లుక్ విషయంలో పర్వాలేదనిపించాడు. డ్రాగన్ లుక్ కూడా ఇలాగే ఉండబోతుందని సమాచారం. ఈ రేంజ్ లో తమ అభిమాన హీరో కనిపిస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారు.. అయ్యా.. అయ్యా.. ఊరమాస్ లుక్ అయ్యా అంటూ ట్రెండ్ చేసేస్తున్నారు. మరి డ్రాగన్ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డులు బద్దలుకొడతారో చూడాలి.
Chiranjeeva: రాజ్ తరుణ్ తో అదిరే అభి 'చిరంజీవ' సినిమా
Tollywood: నిర్మాత సునీల్ తండ్రి కన్నుమూత