Chiranjeeva: రాజ్ తరుణ్ తో అదిరే అభి 'చిరంజీవ' సినిమా

ABN , Publish Date - Nov 05 , 2025 | 03:23 PM

రాజ్ తరుణ్, కుషిత కల్లపు జంటగా నటించిన చిరంజీవ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీతో జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ ప్రీమియర్ షోకు అనిల్ రావిపూడి గెస్ట్ గా హాజరయ్యారు.

Chiranjeeva Movie

'జబర్దస్త్' (Jabardasth) కామెడీ షో నుండి ఎంతోమంది చిత్రసీమలోకి అడుగుపెట్టి హాస్యనటులుగా రాణించారు. విశేషం ఏమంటే అందులో కొందరు దర్శకులుగానూ చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. 'బలగం' వేణు (Balagam Venu) అయితే తన డెబ్యూ మూవీ పేరున ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు. మిగిలిన వారు మాత్రం దర్శకులుగా పెద్దంత రాణించలేదు. వేణు తర్వాత ఎంతో కొంత పేరు తెచ్చుకున్నది ధనరాజ్ (Dhanaraj) మాత్రమే. అయితే ఇప్పుడు మరో జబర్దస్త్ కమెడియన్ దర్శకుడయ్యాడు. అతనే అదిరే అభి (Adire Abhi)!


రాజ్ తరుణ్‌ (Raj Tarun) హీరోగా అభినయ కృష్ణ తెరకెక్కించిన 'చిరంజీవ' (Chiranjeeva) సినిమా ఈ నెల 7 నుండి ఆహా (Aha) లో డైరెక్ట్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీమియర్ షో ప్రెస్ మీట్ లో జబర్దస్ కు చెందిన కమెడియన్స్ రాకెట్ రాఘవ (Rocket Raghava), ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది తదితరులు పాల్గొని అదిరే అభితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ సినిమా కాన్సెప్ట్ గురించి అభి చెప్పాడు. చాలా ఆసక్తికరంగా అనిపించింది. అభి నాకు 'గౌతమ్ ఎస్.ఎస్.సి.' మూవీ టైమ్ నుండి తెలుసు. అప్పటి నుండి మేం మంచి స్నేహితులమయ్యాం. 'కందిరీగ' సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్ రాసేందుకు అభి ఎంతో సాయం చేశాడు. దర్శకుడిగా అతనికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.

1 (1).jpg


అదిరే అభి ఉరఫ్‌ అభినయ కృష్ణ మాట్లాడుతూ, 'ఇరవై మూడేళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాను. పది పన్నెండేళ్ళుగా దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్నాను. ఇప్పటికి అది కార్యరూపంలోకి వచ్చింది. ఈ సినిమాను హీరోకు ఏజ్ మీటర్ అనే కాన్సెప్ట్ తో చేశాం. మీ అందరికీ అది నచ్చుతుందనే నమ్మకం ఉంది' అని అన్నారు. హీరో రాజ్ తరుణ్‌ మాట్లాడుతూ, 'ఆహాతో నాకు మంచి అనుబంధం ఉంది. లాక్ డౌన్ టైమ్ లో నా మూవీ 'ఒరేయ్ బుజ్జిగా' అందులోనే స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పుడు 'చిరంజీవ' రాబోతోంది. మా కంటే అభి డైరెక్టర్ గా ఎంతో కష్టపడ్డాడు. దానికి తగ్గ ఫలితం దక్కుతుందనే నమ్మకం ఉంది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆహా సీయీఓ రవికాంత్, ఆహా కంటెంట్ హెడ్ శ్రావణి, నటులు కిరీటి, సంజయ్ కృష్ణ పాల్గొన్నారు. కుషిత కల్లపు హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించారు.

Also Read: Tollywood: నిర్మాత సునీల్ తండ్రి కన్నుమూత

Also Read: Allu Aravind: నాకంటూ ఓ స్దాయి ఉంది.. నేను మాట్ల‌డ‌ను! బండ్ల‌న్న‌కు.. అల్లు అర‌వింద్‌ అదిరిపోయే కౌంట‌ర్

Updated Date - Nov 05 , 2025 | 03:28 PM