Little Hearts: సాయి మార్తాండ్ తో నితిన్ సినిమా...
ABN, Publish Date - Oct 13 , 2025 | 03:49 PM
లిటిల్ హార్ట్స్ దర్శకుడు సాయి మార్తాండ్ తో నితిన్ ఓ సినిమా చేయబోతున్నాడు. దీన్ని సునీల్ నారంగ్, పుస్కర్ రామ్మోహన్ నిర్మించబోతున్నారు. అతి త్వరలోనే ఇది పట్టాలెక్కుతుందని తెలుస్తోంది.
వరుస పరాజయాలతో ప్రయాణం చేస్తున్నాడు నితిన్ (Nithiin). 2013లో 'గుండె జారి గల్లంతయ్యిందే' (Gunde Jaari Gallanthayyinde) తర్వాత ఏడేళ్ళకు 'భీష్మ'తో మరో హిట్ ను అందుకున్నాడు. మళ్ళీ ఐదేళ్ళుగా నితిన్ తో సక్సెస్ దోబూచులాడుతోంది. ఇటీవల భారీ అంచనాలతో వచ్చిన 'రాబిన్ హుడ్', 'తమ్ముడు' (Tammudu) రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. దాంతో దిల్ రాజు (Dil Raju), 'బలగం' (Balagam) వేణుతో తీయాలనుకున్న 'ఎల్లమ్మ' (Ellamma) ప్రాజెక్ట్ నుండి నితిన్ తప్పుకున్నాడని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే మొన్నటి వరకూ నితిన్ తనతో 'ఇష్క్' మూవీ తీసిన విక్రమ్ కె. కుమార్ తో 'స్వారీ' అనే స్పోర్ట్స్ డ్రామా చేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టారని తెలుస్తోంది. ఇటీవల స్మాల్ బడ్జెట్ తో తెరకెక్కించి, బిగ్ హిట్ ను అందుకున్న సినిమా 'లిటిల్ హార్ట్స్'. దాదాపు నలభై కోట్ల గ్రాస్ ను ఈ మూవీ వసూలు చేసింది. దాంతో ఆ సినిమా దర్శకుడు సాయి మార్తాండ్ తో సినిమాలు నిర్మించడానికి ప్రొడ్యూసర్స్ క్యూ కట్టారు. అయితే సాయి మార్తాండ్ తో సినిమా నిర్మించే ఛాన్స్ సునీల్ నారంగ్ (Suniel Narang), పుస్కర్ రామ్మోహన్ (Puskur Ram Mohan Rao) కు దక్కినట్టు తెలుస్తోంది. ఇటీవల సాయి మార్తాండ్... హీరో నితిన్ ను కలిసి ఓ కథ చెప్పగా, అది అతనికి బాగా నచ్చిందట. ఈ కామెడీ డ్రామాకు నితిన్ దాదాపుగా ఓకే చెప్పాడని అంటున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే, నితిన్, సాయి మార్తాండ్ కాంబోలో ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కర్ రామ్మోహన్ నిర్మిస్తారని తెలిసింది. ఇటీవల వీళ్ళిద్దరి కాంబోలో శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ', 'కుబేర' చిత్రాలను రూపొందించారు.
Also Read: Rishab Shetty: 'ఛావా' తర్వాత 'కాంతార - చాప్టర్ 1'....
Also Read: Icon Star: అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో సరికొత్త జోష్