Rishab Shetty: 'ఛావా' తర్వాత 'కాంతార - చాప్టర్ 1'....
ABN , Publish Date - Oct 13 , 2025 | 02:39 PM
ఈ యేడాది భారత్ లో అత్యధిక గ్రాస్ ను వసూలు చేసిన రెండో సినిమాగా 'కాంతార : చాప్టర్ 1' నిలించింది. మొన్న 'కూలీ' కలెక్షన్స్ ను అధిగమించిన 'కాంతార' ఇప్పుడు సైయారానూ వెనక్కి నెట్టేసింది. ఇక దీని ముందు ఉన్న సినిమా 'ఛావా' మాత్రమే!
కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించి, దర్శకత్వం వహించిన 'కాంతార : చాప్టర్ 1' (Kanthara: Chapter 1) విజయపథంలో సాగిపోతోంది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన 'కాంతార' (Kanthara) పది రోజుల్లోనే పలు సరికొత్త రికార్డులను నెలకొల్పింది. రజనీకాంత్ (Rajinikanth) 'కూలీ' (Coolie) టోటల్ రన్ ను రెండు రోజుల క్రితం దాటేసిన 'కాంతార', తాజాగా 'సైయారా' (Saiyaara) ఫుల్ రన్ కలెక్షన్స్ ను కూడా అధిగమించింది. ఇంతవరకూ 'కాంతార' రూ. 655 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ యేడాది హయ్యెస్ట్ గ్రాస్ ను కలెక్ట్ చేసిన రెండో సినిమాగా 'కాంతార' నిలిచింది.
ఈ యేడాది ద్వితీయార్థంలో వచ్చిన 'సైయారా' ప్రేమకథా చిత్రాలలో సరికొత్త మార్క్ ను క్రియేట్ చేసింది. పరాజయాలతో సతమతమౌతున్న బాలీవుడ్ కు కొత్త ఊపిరిని అందించింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన 'ఛావా' తర్వాత, ఈ యేడాది 500 కోట్ల మార్క్ ను దాటిన సినిమాలుగా 'కూలీ', 'సైయారా' నిలిచాయి. 'కూలీ' సినిమా రూ. 520 కోట్ల గ్రాస్ ను వసూలు చేయగా, 'సైయారా' రూ. 565 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇంతవరకూ రూ. 655 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన 'కాంతార'... వీటిని దాటేసి... 'ఛావా' రికార్డుల వైపు దూసుకుపోతోంది. రూ. 800 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన 'ఛావా' (Chaava) తర్వాత స్థానంలో ఇప్పుడు 'కాంతార' ప్రీక్వెల్ ఉంది. ఈ యేడాది హయ్యెస్ట్ గ్రాసర్ గా 'కాంతార' నిలవాలంటే... ఇంకా నూట యాభై కోట్ల గ్రాస్ ను ఇది వసూలు చేయాలి.
Also Read: Icon Star: అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో సరికొత్త జోష్
Also Read: Narne Nithin: శ్రీవారిని దర్శించుకున్న నూతన వధూవరులు