Rakshabandhan: అన్నలతో నిహారిక స్పెషల్ బాండింగ్
ABN , Publish Date - Aug 09 , 2025 | 03:33 PM
రక్షాబంధన్ సందర్భంగా నిహారిక కొణిదెల తన అన్నయ్యలు చెర్రీ, వరుణ్ గురించి హార్ట్ ఫుల్ పోస్ట్ ఒకటి పెట్టింది. అలానే ఆమె నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' విడుదలై యేడాది అయిన సందర్భంగా టీమ్ కు శుభాకాంక్షలు తెలిపింది.
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) కు ఇది రాఖీ పౌర్ణమి సమ్ థింగ్ స్పెషల్. ఎందుకంటే ఆమెకు ఇది డబుల్ ట్రీట్ ను అందించిన రోజు. పెదనాన్న మెగా స్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ (Ram Charan) తోనూ, సొంత అన్న వరుణ్ తేజ్ (Varun Tej( తోనూ నిహారిక ఫోటోలను పెడుతూ తన మనసులోని మాటలను ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. ఈ రాఖీ పండగ తనకు మరింత ప్రేమను అందిస్తోందని నిహారిక పేర్కొంది. తనకు ఎల్లప్పుడు అన్నయ్య చెర్రీ, వరుణ్ ఇద్దరూ వన్ స్టాప్ సొల్యూషన్స్ అని మనసులో మాట చెప్పింది. ఆ అన్నలిద్దరికీ చెల్లిగా అనిపించుకోవడం గ్రేట్ గా ఉంటుందని నిహారిక పేర్కొంది. ఇక ఈ రక్షాబంధన్ రోజునే నిహారిక మరో గుడ్ న్యూస్ ను గుర్తు చేసుకుంది.
సరిగ్గా ఏడాది క్రితం ఆగస్ట్ 9వ తేదీనే నిహారిక నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' (Committee Kurrollu) సినిమా జనం ముందుకు వచ్చింది. అందరూ కొత్తవాళ్ళతో ఆమె నిర్మించిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కావడమే కాకుండా అవార్డుల పంటనూ పండించింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గద్దర్ అవార్డులలోనూ రెండింటిని ఈ సినిమా గెలుచుకుంది. ఉత్తమ జాతీయ సమైక్యత, మత సామరస్యం, సామాజిక అభ్యున్నతి చిత్రంగా 'కమిటీ కుర్రోళ్ళు' ఎంపికైంది. అలానే ఉత్తమ నూతన చిత్ర దర్శకుడిగా యదువంశీ గద్దర్ అవార్డు (Gaddar Award) ను అందుకున్నారు. రివార్డులు, అవార్డులు తన చిత్రానికి దక్కడంతో నిహానిక వెంటనే మరో సినిమాకు శ్రీకారం చుట్టింది.
Also Read: Kiran Abbavarm: కేరళ కుట్టీతో కిరణ్ కథాకళి
Also Read: Mahesh Charity: మహేశ్ గురించి గూగుల్‌ని అడిగిన ప్రశ్నలివే