Mahesh Charity: మహేశ్ గురించి గూగుల్‌ని అడిగిన ప్రశ్నలివే
ABN , Publish Date - Aug 09 , 2025 | 02:59 PM
వెండితెరపై సూపర్‌స్టార్‌గా ఎదిగిన మహేశ్.. నిజజీవితంలోనూ సూపర్‌స్టార్, రియల్‌స్టార్. కొన్ని వందల కుటుంబాల్లో గుండెల్లో గూడు కట్టుకున్న సైనికుడు. ఆయన చేసే ఛారిటీ గురించి అందరికీ తెలిసిందే!
సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. ఆ పేరే ఓ బ్రాండ్..
ఓ సినిమాలో చెప్పినట్లు ఆ పేరులోనే వైబ్ ఉంది..
కలెక్షన్లు కొల్లగొట్టడంలో ‘ఆగని దూకుడు అతనిది..’
బాక్సాఫీస్‌కు బిజినెస్‌మెన్..
ప్రేక్షకుల మదిలో శ్రీమంతుడు..
మంచి మనసున్న చిన్నోడు..
ఇలా మహేశ్ గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి..
వెండితెరపై సూపర్‌స్టార్‌గా ఎదిగిన మహేశ్.. నిజజీవితంలోనూ సూపర్‌స్టార్, రియల్‌స్టార్. కొన్ని వందల కుటుంబాల్లో గుండెల్లో గూడు కట్టుకున్న సైనికుడు. ఆయన చేసే ఛారిటీ గురించి అందరికీ తెలిసిందే! ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వారి పాలిట ప్రాణదాతగా నిలిచారు. ఆయన ఫౌండేషన్ నుంచి సాయం పొందాలంటే ఇలా చేయాలి..
ఈ సంస్థ ద్వారా గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న పేద చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్స్ చేయిస్తారు. ఇందుకోసం అందరికీ అందుబాటులో ఓ వెబ్ సైట్ తీసుకొచ్చారు. డైరెక్ట్‌గా 'https://www.maheshbabufoundation.org/' సైట్‌లో అర్జీ పెట్టుకువచు. దీనిలో పూర్తి వివరాలు ఎంటర్ చేస్తే ఆయన సిబ్బంది మిమ్మల్నిసంప్రదిస్తారు. కొద్ది రోజుల క్రితమే మహేష్ బాబు ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా బయోలో ఈ ఫౌండేషన్ లింక్ షేర్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు ఆయన్ను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. మహేష్ తమ పాలిట దేవుడని సాయం పొందిన ఎందరో ప్రశంసిస్తున్నారు.
----
అలాగే తాజాగా మహేశ్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆయన వ్యక్తిగత జీవితం గురించి గూగుల్‌ని ఎన్నోసార్లు రకరకాల ప్రశ్నలు వేశారు అభిమానులు. ఆ వివరాలేంటో చూద్దాం.
బాబు ఏం చదివారు?
మహేశ్ గురించి సెర్చ్ చేసిన అంశాల్లో ఆయన అకడమిక్ టాపిక్ కూడా ఉంది. ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించినా ఆయన చదువును అశ్రద్ధ చేయలేదు. చెన్నైలోని లయోలా కాలేజీలో కామర్స్‌లో డిగ్రీ పొందారు.
మహేష్ ఏజ్ ఎంత?
వయసు పెరుగుతున్నా మహేష్ బాబు రోజురోజుకీ చిన్నోడైపోతున్నాడు అంటూ చిరంజీవి కామెంట్ చేశారు. అయితే ఎక్కువమంది నెటిజన్లు మహేశ్ వయసు గురించి సెర్చ్ చేశారు. ఆయన అందం అటువంటిది. ఆగస్టు 9, 1975లో మహేష్ బాబు జన్మించారు. ఇప్పుడు ఆయన వయసు 50 ఏళ్ళు.
మహేశ్ భార్య ఎవరు.. ఆమె వయసు ఎంత?
నెటిజన్లు అల్లరి చేష్టలు మామూలుగా ఉండవు. మహేష్ వయసు మాత్రమే కాదు... ఆయన భార్య ఎవరో కూడా తెలుసుకోవాలని గూగుల్ తల్లిని అడుగుతున్నారు. పైగా ఆవిడ వయసు, ఇద్దరికి మధ్య వయసు తేడా గురించి కూడా అడిగారు. మహేశ్ భార్య నమ్రత శిరోద్కర్ జనవరి 22, 1972లో జన్మించారు. మహేష్ కంటే ఆమె మూడేళ్లు పెద్ద. ఆ కారణంతో నమ్రత వయసు గురించి కూడా నెటిజన్లు సెర్చ్ చేశారు.
లవ్ స్టోరీ గురించి..
నమ్రత, మహేశ్ లవ్ స్టోరీ గురించి కూడా గూగుల్ సెర్చ్ చేశారు నెటిజన్లు. ‘వంశీ’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడే ఇద్దరి మనసులు కలిశాయి. ‘వంశీ’ సినిమా 2000లో విడుదలైంది. ఐదేళ్ల తర్వాత 2005 ఫిబ్రవరి 10న తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరమయ్యారు. పిల్లల్ని, కుటుంబాన్ని చూసుకోవడంతోపాటు మహేష్ ఛారిటీ కార్యక్రమాలను ఆమె స్వయంగా చూసుకుంటారు.
ఎన్ని కార్లు ఉన్నాయ్?
అభిమానులకు తమ అభిమాన హీరో ఉపయోగించే వాచ్ నుంచి గాడ్జెట్, కారు ఇలా అన్నింటి పైనా ఆసక్తి ఉంటుంది. ఆయన గురించి గూగుల్‌లో సెర్చ్ చేసిన విషయాల్లో మహేశ్‌కు ఎన్ని కార్లు ఉన్నాయి? మహేశ్ ఎక్కువగా డ్రైవ్ చేసే కార్ ఏది అనే ప్రశ్న కూడా ఉంది. మహేష్ ఎక్కువగా రేంజ్ రోవర్ కారులో వెళతారు. దాని ఖరీదు సుమారు 2 కోట్లు. ఆయన దగ్గర మొత్తం నాలుగు లగ్జరీ కార్లు ఉన్నాయి. రేంజ్ రోవర్ సహా రూ. 1.10 కోట్లు విలువ చేసే ఆడి ఏ8, కొట్టిన్నర ఖరీదు చేేస టయోటా ల్యాండ్ క్రూజర్, బీఎండబ్ల్యూ ఉన్నాయని తెలిసింది. అయితే ఆయన డ్రైవింగ్ సీట్‌లో కూర్చునేది చాలా తక్కువ. మహేష్ కేర్‌వ్యాన్ ఖరీదు ఆరు కోట్ల రూపాయలు.
ALSO READ: Nithin: నితిన్‌తో పూజా.. విక్రమ్ సక్సెస్ మ్యాజిక్ వర్కవుట్ అవుతుందా..
Kantara: Chapter 1: కాంతార షూట్.. మరో మరణం.. కారణమేంటి