Kiran Abbavarm: కేరళ కుట్టీతో కిరణ్ కథాకళి

ABN , Publish Date - Aug 09 , 2025 | 02:07 PM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన చిత్రం 'కె-ర్యాంప్'. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ విడుదలైంది... ఎలా ఉందో తెలుసుకుందాం.

Kiran Abbavaram K- Ramp

యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) కెరీర్ అప్ అండ్ డౌన్స్ తో సాగుతోంది. ఒక సక్సెస్ వస్తే... రెండు మూడు పరాజయాలు పలకరిస్తున్నాయి. 'రాజావారు రాణిగారు'తో తెరంగేట్రమ్ చేసిన కిరణ్‌ అబ్బవరంకు ఆ తర్వాత సినిమా 'ఎస్. ఆర్. కళ్యాణ మండపం' మంచి సక్సెస్ ను ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వరుసగా మూడు ఫ్లాప్స్ అతని ఖాతాలో పడ్డాయి. తిరిగి 'వినరో భాగ్యము విష్ణు కథ'తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఆ తర్వాత మరో రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. గత యేడాది దీపావళి కానుకగా వచ్చిన 'క' (Ka) మళ్ళీ కిరణ్ లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది... బట్ ఈ యేడాది వచ్చిన 'దిల్ రుబా' తిరిగి నిరాశ పర్చింది.


ఈ నేపథ్యంలో కిరణ్ చేస్తున్న మరో సినిమా 'కె-ర్యాంప్' (K-Ramp). టైటిల్ బట్టి కిరణ్‌ అబ్బవరం ర్యాంప్ అని మన అనుకోవచ్చు... కానీ ఆగస్ట్ 9న విడుదలైన ఫస్ట్ సింగిల్ చూస్తే... ఇది కేరళ ర్యాంప్ అనిపించేలా ఉంది. కేరళలోని సంప్రదాయ నృత్యం కథాకళి నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించారు. మలయాళీ భామతో ప్రేమలో పడిన హీరో పాడే పాటగా ఇది సాగింది. 'ఇన్ స్టా ఆపేశానే, ట్విట్టర్ మానేశానే, నీకే ట్యాగ్ అయ్యానే మలయాళీ పిల్లా' అని హీరో చెప్పగానే... దానికి రియాక్షన్ గా హీరోయిన్ 'ఫోనే మార్చేశానే, ఛాటింగ్ ఆపేశానే, నీకే సింక్ అయ్యానే వదలను ఇల్లా...' అంటూ బదులివ్వడం బాగుంది. దాంతో హీరో ఇంకాస్తంత వివరంగా 'వైబే వచ్చేసిందే నిన్నే చూడగానే, లెఫ్టే ఉన్న గుండె రైటు రైటందే...' అంటూ బదులిస్తాడు. కిరణ్‌ అబ్బవరం సరసన ఈ సినిమాలో 'రంగబలి' ఫేమ్ యుక్తి తరేజా (Yukti Thareja) హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య ఈ పాటను డాన్సర్స్ తో తీశారు.


కిరణ్‌ అబ్బవరం అండ్ బ్యాచ్ ఇందులో ఎర్ర షర్ట్, తెల్ల లుంగీ కట్టుకుని మాస్ స్టెప్పులేస్తే.. యుక్తీ తరేజా అండ్ టీమ్ గోల్డెన్ బోర్డర్ వైట్ శారీ, రెడ్ జాకెట్ తో సంప్రదాయ నృత్య రీతులతో ఆకట్టుకున్నారు. ఈ పాటను సురేంద్ర కృష్ణ క్యాచీ వర్డ్స్ తో రాశాడు. అంతే క్యాచీగా పాడుకునే విధంగా చేతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj) దాన్ని ట్యూన్ చేశాడు. అంతేకాదు... సాహితీ చాగంటితో కలిసి అతనే ఈ పాటను పాడాడు కూడా! 'దిల్ రుబా'తో దెబ్బతిన్న కిరణ్‌ అబ్బవరం మార్కెట్ మరి దీపావళికి వస్తున్న 'కె-ర్యాంప్'తో సెట్ అవుతుందేమో చూడాలి. ఎందుకంటే దీని తర్వాత అతను 'చెన్నయ్ లవ్ స్టోరీ' అనే మరో సినిమా చేస్తున్నాడు. 'కె-ర్యాంప్' మూవీని జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ, శివ బొమ్మకు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మూడు నిమిషాల 36 సెకన్లు ఉన్న ఈ ఫస్ట్ సింగిల్ తో కిరణ్‌ అబ్బవరం మంచి మార్కులే వేయించు కుంటున్నాడు. ఈ పాటకు సోషల్ మీడియాలో చక్కని స్పందన వస్తోంది.

Also Read: Kantara: Chapter 1: కాంతార షూట్‌.. మరో మరణం.. కారణమేంటి

Also Read: SSMB29: గ్లోబ్‌ట్రోటర్‌ ఫస్ట్‌ లుక్‌ అప్పుడే.. జక్కన్న అప్‌డేట్‌ అదిరింది..

Updated Date - Aug 09 , 2025 | 02:10 PM

KIran Abbavaram: త్వరలో తండ్రి కాబోతున్నారు 

Kiran Abbavaram -KA: ఫస్ట్ సింగిల్ 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' రిలీజ్

Kiran Abbavaram Marriage: ఆ హీరోయిన్ ని పెళ్లిచేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం, ఇంతకీ ఎవరంటే...

Kiran Abbavaram- Rahasya: ఆ పిలుపు కోసం ఇంకా 38 రోజులు వేచి చూడాలి!