Allu Kanakaratnamma: అరవింద్ కు ప్రధాని లేఖ...
ABN , Publish Date - Sep 04 , 2025 | 11:58 AM
ఇటీవల కన్నుమూసిన అల్లు కనకరత్నం మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలిపారు. ఈ మేరకు ఆయన అల్లు అరవింద్ కు ఓ సందేశాన్ని పంపారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) తల్లి, అల్లు అర్జున్ (Allu Arjun) నానమ్మ కనకరత్నం ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత, స్వర్గీయ అల్లు రామలింగయ్య (Ramalingaiah) భార్య కనకరత్నమ్మ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలిపారు.
తల్లిని కోల్పోయిన అల్లు అరవింద్ ను ఓదార్చుతూ తన మనసులోని భావాలను లేఖ రూపంలో తెలియచేశారు. ప్రధాని లేఖను అందుకున్న అరవింద్... తిరిగి ప్రధానికి కృతజ్ఞతలు తెలియచేశారు.
దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలుకూ వెళ్ళొచ్చిన అల్లు రామలింగయ్య, అప్పట్లో కనకరత్నం పెళ్ళి సంబంధం వచ్చినప్పుడు వెంటనే ఇష్టపడి ఆమెను వివాహం చేసుకున్నారు. అందుకు కారణం అప్పట్లోనే ఆమె నూలు వడకడాన్ని అల్లు రామలింగయ్య చూశారట. స్వదేశీ ఉద్యమం బలంగా ఉన్న ఆ రోజుల్లో నూలు వడకడం అందరూ నేర్చుకోవాలని గాంధీ పిలుపునిచ్చారు. అందులో భాగంగా కనకరత్నం నూలు వడకడాన్ని చూసిన రామలింగయ్య ఆమెను ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారని చెబుతుండేవారు.
Also Read: Anushka: ప్రభాస్‌తో కెమిస్ట్రీ.. అనుష్క ఏం చెప్పిందంటే...
Also Read: Gatta Kusthi 2: ‘గట్టా కుస్తి-2’ షూటింగ్ ప్రారంభం