Anushka: ప్రభాస్‌తో కెమిస్ట్రీ.. అనుష్క ఏం చెప్పిందంటే.
ABN , Publish Date - Sep 04 , 2025 | 11:06 AM
అనుష్క (Anushka) నటించిన ‘ఘాటి’ (Ghaati) విడుదలకు సిద్ధమైంది. క్రిష్ (Krish0 దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ముమ్మరం చేశారు మేకర్స్.
అనుష్క (Anushka) నటించిన ‘ఘాటి’ (Ghaati) విడుదలకు సిద్ధమైంది. క్రిష్ (Krish0 దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ముమ్మరం చేశారు మేకర్స్. అయితే ప్రమోషన్స్‌లో అనుష్క కనిపించడం లేదు కానీ, ఆమె మాట వినిపిస్తోంది. ఫోన్‌లోనే సినిమా గురించి పబ్లిసిటీ చేస్తుంది. మొన్న రానా దగ్గుబాటికి ఫోన్‌లో ఇంటర్వ్యూ ఇచ్చి ఆసక్తికర విషయాలు షేర్ చేసింది. తాజాగా మరోసారి అలాంటి ప్రయత్నమే చేసింది. ఘాటి గురించి మరిన్ని విషయాలు చెప్పుకొచ్చింది. అలాగే ప్రభాస్ గురించి ప్రస్తావించింది. ‘ఘాటి’లో తను నటించిన శీలావతి క్యారెక్టర్ తన ఫిల్మోగ్రఫీలో నిలిచిపోతుందని తెలిపింది. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి చిత్రాల తర్వాత అంతటి బలమైన పాత్ర ఇదని చెప్పింది. క్రిష్ గారు సరోజలాంటి క్లాసిక్ క్యారెక్టర్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ శీలావతి లాంటి గొప్ప క్యారెక్టర్ రాశారు. ఆయన సెన్సిబిలిటీస్‌తో ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా తెరకెక్కించారు’ అని అన్నారు. అలాగే అనుష్క మీడియా ముందుకు ఎప్పుడొచ్చిన ప్రభాస్ (Prabhas) ప్రస్తావన తప్పకుండా వస్తుంది.
తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్‌తో (Prabhas and anushka) తన స్పెషల్ కెమిస్ట్రీ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ‘నేను ప్రభాస్ మంచి స్నేహితులం. మా జంట తెరపై అంత ప్రత్యేకంగా కనిపించడానికి, ఆకట్టుకోవడానికి కథ, క్యారెక్టర్స్‌ని రాసిన విధానం కారణం. అంతే కాదు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ కావడంతో నటనలో ఇద్దరికీ మంచి కంఫర్ట్ ఉంటుంది. అది కూడా ఓ కారణమే. ఏదేమైనా సరైన క్యారెక్టర్స్, కథ ఉంటేనే కెమిస్ర్టీ పండుతుంది’ అని అనుష్క అన్నారు. ప్రస్తుతం మీరు బయటకు రావడం లేదు.. సమయాన్ని ఎలా గడుపుతున్నారన్న ప్రశ్నకు.. అవును నిజమే నేను ఇంట్లోనే ఉంటున్నా. ఇంట్లో వాళ్ల పెళ్లిలకు కూడా హాజరు కావడం లేదు. అది నాపై ఉన్న పెద్ద కంఫ్లైంట్. అయితే బాగా ట్రావెల్ చేస్తా. చాలా ప్రదేశాలు తిరుగుతున్నాను. మహాభారతం చదవుతున్నా. నచ్చిన సినిమాలు ఎక్కువగా చూస్తున్నాను’ అని తెలిపారు స్వీటీ.
ALSO READ: Lokesh Kanagaraj: అనిరుధ్ సంగీతంపై అంత నమ్మకం ఏంటో..
Nagarjuna Defamation Case: అవమానానికి గురయ్యాం.. పరువు నష్టం దావా కేసులో నాగార్జున తుది వాంగ్మూలం