Allu Kanakaratnam: ముగిసిన కనకరత్నమ్మ అంత్యక్రియలు.. పాడె మోసిన మనవళ్లు
ABN , Publish Date - Aug 30 , 2025 | 03:54 PM
కోకాపేట లోని అల్లు అరవింద్ వ్యవసాయ క్షేత్రంలో అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnam) అంత్యక్రియలు ముగిసాయి. మెగా- అల్లు కుటుంబాల అశ్రు నయనాల మధ్య ఆమె అంతిమ యాత్ర జరిగింది.
Allu Kanakaratnam: కోకాపేట లోని అల్లు అరవింద్ వ్యవసాయ క్షేత్రంలో అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnam) అంత్యక్రియలు ముగిసాయి. మెగా- అల్లు కుటుంబాల అశ్రు నయనాల మధ్య ఆమె అంతిమ యాత్ర జరిగింది. కనకరత్నమ్మ పాడెను అల్లుడు అయిన చిరంజీవి (Chiranjeevi), మనవళ్లు అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్ (Ram Charan) తో పాటు.. ముని మనవడు అయాన్ కూడా మోశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక కనకరత్నమ్మకు ఇద్దరు మనవళ్లు అంటే ఎంతో ప్రాణం. ముఖ్యంగా కొడుకు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ అంటే మహా ఇష్టం. జైలుకు వెళ్లి తిరిగి వచ్చినప్పుడు ఆమె గేటువద్దనే మనవడిని చూసి గట్టిగా కౌగిలించుకొని కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియోను ఫ్యాన్స్ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. నాయనమ్మ అంటే బన్నీకి కూడా ఎనలేని అభిమానం.
చరణ్ కూడా అమ్మమ్మతో బాగా క్లోజ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువ వీరు కనిపించకపోయినా ఇద్దరు మనవళ్లతో కనకరత్నమ్మ చాలా ఆప్యాయంగా ఉండేది. ఏదిఏమైనా అల్లు రామలింగయ్య మరణం తరువాత అల్లు కుటుంబానికి ఉన్న పెద్ద దిక్కు ఆమె. ఇప్పుడు ఆమె కూడా మరణించడంతో అల్లు కుటుంబం ఒంటరి అయ్యిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.