సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nara Rohith: ట్రైలర్ నచ్చకపోతే సినిమా చూడరు.. వార్ 2 ఇప్పటివరకు చూడలేదు

ABN, Publish Date - Aug 20 , 2025 | 02:39 PM

నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకుగా నారా రోహిత్ (Nara Rohith) బాణం అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు.

Nara Rohith

Nara Rohith: నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకుగా నారా రోహిత్ (Nara Rohith) బాణం అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాలో అతని నటనకు తెలుగువారు ఆశ్చర్యపోయారు. బాణం మంచి విజయాన్ని అందుకోవడంతో రోహిత్ కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అయితే సోలో సినిమా తప్ప రోహిత్ కు ఇప్పటివరకు చెప్పుకోతగ్గ సినిమా పడలేదనే చెప్పాలి. మధ్యలో రోహిత్ బరువు పెరగడంతో సినిమాలు తగ్గించేశాడు. ఇక ఈ ఏడాది భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి మార్కులే కొట్టేశాడు. ప్రసుతం రోహిత్ హీరోగా మరోసారి తన సత్తా చాటడానికి సిద్దమయ్యాడు.


నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సుందరకాండ. శ్రీదేవి విజయ్ కుమార్ రీఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా ఆగస్టు 27 న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సోంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన నారా రోహిత్.. వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తూ వస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నారా రోహిత్.. వార్ 2 సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


సాధారణంగా ఒక హీరో ఎలాంటి సినిమాలో అయినా నటించని.. అది హిట్ అయినా.. ప్లాప్ అయినా అతని కుటుంబం మాత్రం హిట్ అనే చెప్పుకొస్తుంది. కనీసం హిట్ అనుకుంటున్నారు అని అయినా చెప్పుకురావడం వింటూనే ఉంటాం. కానీ , నారా రోహిత్ మాత్రం తన కజిన్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 అస్సలు చూడలేదు అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. చూడలేదు అన్నా కూడా పెద్ద చర్చ అయ్యేది కాదు.. కానీ, వార్ 2 ను చూడకుండా కూలీ చూసాను అని చెప్పడం పెద్ద వివాదానికే దారితీసేలా మారింది. రోహిత్ ఏం చెప్పాడంటే.. " ఈమధ్యకాలంలో ట్రైలర్ నచ్చకపోతే సినిమాలు చూడడం లేదు ఎవరు. ఏది ఎక్కువ ఎగ్జైట్ చేస్తుందో దానికే వెళ్తున్నారు.నేను కూలీ 2 సినిమాను థియేటర్ లో చూసాను. ఫ్రెండ్స్ అందరూ కూలీ అనేసరికి దానికి వెళ్లాం. వార్ 2 సినిమా ఇప్పటివరకు చూడలేదు' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నారా రోహిత్ వ్యాఖ్యలను ఎన్టీఆర్ హేటర్స్ వేరేవిధంగా తీసుకొని ట్రోల్ చేస్తున్నారు.

Fallout OTT: ఫాల్అవుట్ సీజన్ 2.. వ‌చ్చేస్తోంది! స్ట్రీమింగ్ ఎప్ప‌టి నుంచంటే

నేషనల్ అవార్డ్ విన్నర్ సింగర్ పివిఎన్ఎస్ రోహిత్ తో స్పెషల్ చిట్ చాట్

Updated Date - Aug 20 , 2025 | 03:25 PM