Fallout OTT: ఫాల్అవుట్ సీజన్ 2.. వచ్చేస్తోంది! స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:59 PM
గత సంవత్సరం విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకున్న హాలీవుడ్ పోస్ట్ అపొకలిప్టిక్ డ్రామా వెబ్ సిరీస్ ఫాలౌట్.
గత సంవత్సరం విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకున్న హాలీవుడ్ పోస్ట్ అపొకలిప్టిక్ డ్రామా వెబ్ సిరీస్ ఫాల్అవుట్ సీజన్ 2 (Fallout Season Two). అణు యుద్దం తర్వాత ప్రపంచమంతా పాశనం కావడంతో బతికున్న ప్రజలు వాల్ట్ టెక్ అనే భారీ సంస్థ రూపొందించిన వాల్ట్ అని పిలవబడే బంకర్లలో నివసిస్తూ ఉంటారు. అయితే రెండు శతాబ్దాల తర్వాత లూసీ అనే యువతి తన తండ్రిని వెతుకుతూ ఆ 33 వాల్ట్ నుంచి బయటకు వస్తుంది. ఈ క్రమంలో ఆమెకు వింత మనుషులు, రాక్షసులు, గ్యాంగులు, క్రూరమైన శత్రువులు ఇలా అనేక రకాల మనస్తత్వాలు ఉన్న మనుషులు ఎదురవుతూ ఉంటారు. అంతేగాక లూసీకి బ్రదర్హుడ్ ఆఫ్ స్టీల్ మాక్సిమస్, ముక్కు లేని లెజెండరీ ఘూల్ బౌంటీ హంటర్ కూపర్ హోవర్డ్ లతో పరిచయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఆమె అక్కడ ఎలా సర్వైవ్ అయ్యారు, వారు తమ ప్రాణాల పైకి వచ్చినప్పుడు ఎలా పోరాడారు, లూసీ తన తండ్రిని కనిపెట్టిందా, వాల్ట్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటనే పాయింట్‌తో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.
సైన్స్ ఫిక్షన్, యాక్షన్, డార్క్ హ్యూమర్, ఎమోషన్స్ అన్నీ కలగలిపి ఈ సిరీస్‌ను తీర్చిదిద్దడంతో మిదటి సీజన్ ఐహించని విజయం సాధించింది. పాలౌట్ సీజన్ 1 (Fallout Season 1) లో ఎల్లా పర్నెల్ (Ella Purnell), ఆరన్ మోటెన్ (Aaron Moten), వాల్టన్ గోగిన్స్ (Walton Goggins), కైల్ మాక్లాక్లాన్ (Kyle MacLachlan) ప్రధాన పాత్రల్లో నటించగా గ్రాహం వాగ్నర్, జెనీవా రాబర్ట్‌సన్-డ్వోరెట్ దర్శకత్వం వహించారు.జోనాథన్ నోలన్, లిసా జాయ్ నిర్మించగా, రమిన్ జవాడి సంగీతం అందించాడు. ఇప్పుడు ఈ సెకండ్ సీజన్ లోనూ ఆ పాత్రలే కంటిన్యూ కానున్నాయి. తాజాగా రెండో సీజన్‌కు సంబంధించి టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే మొదటి భాగాన్ని మించి, అందులో మిస్సయిన వాటిని రంగరించి ఈ సీజన్ రూపొందించినట్లు తెలుస్తోంది. వార్ సన్నివేశాలు, యానిమల్స్ ఎంట్రీ , విజువల్స్ అన్నీ అదిరిపోయేలా ఉన్నాయి. డిజెంబర్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.