Nandamuri Mokshagna: నందమూరి వారసుడు లుక్ బావుంది.. ఎంట్రీ ఎప్పుడో
ABN, Publish Date - Aug 18 , 2025 | 07:02 PM
ఇండస్ట్రీలో ఏ వారసుడు ఎప్పుడు వచ్చినా రాకపోయినా పెద్ద పట్టింపు లేదు కానీ, ఎన్నో ఏళ్లుగా నందమూరి వారసుడి కోసం మాత్రం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
Nandamuri Mokshagna: ఇండస్ట్రీలో ఏ వారసుడు ఎప్పుడు వచ్చినా రాకపోయినా పెద్ద పట్టింపు లేదు కానీ, ఎన్నో ఏళ్లుగా నందమూరి వారసుడి కోసం మాత్రం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) అరంగేట్రం అదుగో ఆ ఏడాది అంటే.. ఇదుగో ఈ ఏడాది అని, ఆ డైరెక్టర్ అంటే కాదు కాదు ఈ డైరెక్టర్ అని ఇంకొందరు.. ఇలా పుకార్లు షికార్లు చేయడమే తప్ప మోక్షజ్ఞ సినిమా పట్టాలెక్కింది లేదు.
ఒకప్పుడు మోక్షు బరువు కారణంగా టాలీవుడ్ ఎంట్రీ ఆలస్యమైందని చెప్పుకొచ్చారు. ఇంకొన్నిరోజులు అసలు మోక్షుకు ఇండస్ట్రీ అంటేనే ఇష్టం లేదని , అందుకే ఇలా నానుస్తున్నాడని మాట్లాడుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే బాలయ్య మాత్రం ఈవెంట్ ఏదైనా.. కొడుకు ఎంట్రీ ఉంటుంది. వచ్చే ఏడాది కన్ఫర్మ్ అని చెప్పుకొస్తూనే ఉన్నాడు. అలా అలా లాగి లాగి గతేడాది మోక్షజ్ఞ ఎంట్రీని అధికారికంగా ప్రకటించారు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ .. మోక్షును పరిచయం చేసే బాధ్యతలు తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి సినిమాను రిలీజ్ చేయమని నందమూరి అభిమానులు గోల పెట్టేశారు.
అయితే ఆనందం మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. మోక్షు - ప్రశాంత్ వర్మ సినిమా పట్టాలెక్కకముందే క్యాన్సిల్ అయ్యింది. కొన్ని కారణాల వలన మోక్షును ప్రశాంత్ వర్మ పరిచయం చేయడం లేదని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఇక ప్రస్తుతం మోక్షజ్ఞ మొదటి సినిమా కు డైరెక్టర్ ను వెతికే పనిలో పడ్డాడట బాలయ్య. ఈలోపు వారసుడు తన ఫిట్ నెస్ మీద బాగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తున్నాడు. అంతకుముందు కంటే మోక్షజ్ఞలో మార్పు బాగా కనిపిస్తుంది. ఇదివరకటి కంటే మరింత బక్కచిక్కి కనిపిస్తున్నాడు.
తాజాగా ఒక ఈవెంట్ లో మోక్షజ్ఞ కొత్త లుక్ అదిరిపోయింది. బ్లూ కలర్ కుర్తాలో నవ్వుతూ నడుస్తుంటే నందమూరి వారసుడు మరింత అందంగా ఉన్నాడు. మోక్షు కొత్త లుక్ చూసిన అభిమాని.. వ్వా బిడ్డ ముఖంలో ఆ తేజస్సు చూడు.. నందమూరి హీరో అంటే ఇలానే ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు. మరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు.. ఏ డైరెక్టర్ చేతిలో ఉంటుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
CM Revanth Reddy: భారతీయ సినిమా నిర్మాణ కేంద్రంగా హైదరాబాద్
Girija: నాగార్జునతో రికార్డ్ లిప్ లాక్ పెట్టిన హీరోయిన్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందేంటి