Nandamuri Mokshagna: బాలయ్య వారసుడు ఎట్టున్నడో చూశారా.. పిక్ వైరల్!

ABN , First Publish Date - 2023-08-28T14:33:51+05:30 IST

నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినీ అరంగేట్రం కోసం నందమూరి అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. అదిగో, ఇదిగో అని అంటున్నారు కానీ.. ఆయన ఎంట్రీకి సంబంధించి ఇప్పటి వరకు సరైన క్లారిటీ రాలేదు. తాజాగా ‘భగవంత్ కేసరి’ సెట్స్‌లో మోక్షజ్ఞ హీరోయిన్ శ్రీలీలతో మాట్లాడుతోన్న ఫొటో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

Nandamuri Mokshagna: బాలయ్య వారసుడు ఎట్టున్నడో చూశారా.. పిక్ వైరల్!
Nandamuri Mokshagna at Bhagavanth Kesari Sets

నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) వారసుడు నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) సినీ అరంగేట్రం కోసం నందమూరి అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. అదిగో, ఇదిగో అని అంటున్నారు కానీ.. ఆయన ఎంట్రీకి సంబంధించి ఇప్పటి వరకు సరైన క్లారిటీ రాలేదు. బాలయ్య కూడా కుప్పలుకుప్పలుగా కథలు రెడీ చేసి పెడుతున్నాం.. త్వరలోనే అస్త్రాన్ని వదులుతాం అని అంటున్నాడు తప్పితే.. ఎప్పుడనేది మాత్రం అస్సలు వివరణ ఇవ్వడం లేదు. ఈ లోపు ఈ నందమూరి వారసుడిపై ఎన్నో రకాలుగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా బాలయ్య చేస్తున్న ‘భగవంత్ కేసరి’ సెట్స్‌లో మోక్షజ్ఞ మాట్లాడుతోన్న ఫొటో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.


Mokshu-2.jpg

ఈ ఫొటోలో మోక్షూని చూసిన వారంతా.. వారసుడి అరంగేట్రానికి టైమ్ దగ్గరకి వచ్చేసిందనేలా కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఎందుకంటే.. ఈ పిక్‌లో మోక్షూ అలా ఉన్నాడు మరి. ఇంతకు ముందు అతని లుక్‌పై కూడా కామెంట్స్ వచ్చాయి. కానీ ఈసారి పక్కా హీరో మెటీరియల్‌గా మోక్షూ కనిపిస్తుండటంతో.. నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. ఇక ఈ పిక్‌లో మోక్షజ్ఞ హీరోయిన్ శ్రీలీల (Sreeleela)తో మాట్లాడుతుండగా.. పక్కన దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఆశ్చర్యంగా.. మోక్షు వైపే చూస్తుండటం గమనించవచ్చు. మొత్తంగా ఈ పిక్.. సోషల్ మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. (Mokshagna at Bhagavanth Kesari Sets)

Mokshu.jpg

ఇక ఈ పిక్ చూసిన వారంతా రకరకాలుగా మాట్లాడుకుంటుండటం విశేషంగా చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ఇంత వరకు ప్రకటనే రాలేదు.. మోక్షజ్ఞ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తే బాగుంటుందనేలా కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరి జోడీ ఈ పిక్‌లోనే కాదు.. సినిమాలోనూ బాగుంటుందనేలా నందమూరి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) సెట్ నుంచి వచ్చిన ఈ పిక్‌తో ఒక్కసారిగా మోక్షజ్ఞ ట్రెండ్‌లోకి వచ్చేశాడు. ఈ విధంగా ట్రెండ్ చేస్తే.. ఖచ్చితంగా బాలయ్య కూడా కొడుకు ఎంట్రీపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అభిమానుల కోరిక కూడా అదే. ఇక ‘భగవంత్ కేసరి’ విషయానికి వస్తే.. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల ఓ కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచం వ్యాప్తంగా విడుదలకానుంది.


ఇవి కూడా చదవండి:

============================

*AskSRK: ‘జవాన్’.. మరికొన్ని ఆసక్తికర విషయాలు చెప్పిన బాలీవుడ్ కింగ్ ఖాన్

*****************************************

*Raghava Lawrence: తప్పు జరిగింది.. నన్ను క్షమించండి

*****************************************

*Shivathmika Rajasekhar: మరో తమిళ ఫిల్మ్‌లో ఛాన్స్.. హీరో ఎవరంటే..

*****************************************

*Raghava Lawrence: ‘చంద్రముఖి’గా కంగనా ర‌నౌత్‌ అనగానే భయపడిపోయా..

***************************************

Updated Date - 2023-08-28T14:36:46+05:30 IST