Akhanda -2: బాలకృష్ణపై పథకం ప్రకారం ట్రోలింగ్...
ABN, Publish Date - Oct 03 , 2025 | 04:42 PM
నందమూరి బాలకృష్ణ 'అఖండ -2' విడుదలకు సిద్థమౌతున్న సమయంలో ప్రత్యర్థి వర్గాలు ట్రోలింగ్ కు సన్నాహాలు చేస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే నెగెటివ్ టాక్ ను స్ప్రెడ్ చేయడానికి సిద్థమైనట్టు తెలుస్తోంది.
నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) 'అఖండ-2- తాండవం' (Akhanda -2 Thandavam) డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. బాలకృష్ణ కొత్త సినిమాలను ట్రోల్ చేయడానికి ప్రత్యర్థులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అయితే ఈ మధ్య జరిగిన పరిణామాల నేపథ్యంలో బాలయ్య సినిమాను ట్రోల్ చేయడానికే కొందరు ప్రణాళికలు రూపొందిస్తున్నారట.
తెలుగు స్టార్ హీరోస్ లో బాలకృష్ణపై సాగిన నెగటివ్ పబ్లిసిటీ మరే హీరోకు జరగలేదంటే అతిశయోక్తి కాదు. బాలయ్యపై అదే పనిగా ఉన్నవి లేనివి ప్రచారం చేస్తూ అప్పట్లో విశేషంగా నెగటివ్ పబ్లిసిటీ సాగింది. బాలయ్య సినిమా వస్తే చాలు సోషల్ మీడియాలో సదరు చిత్రానికి నెగటివ్ పబ్లిసిటీ స్టార్ట్ చేసేవారు. అలాగే బాలయ్య ఏమి మాట్లాడినా దానిపై పలు 'మీమ్స్' చేస్తూ కూడా కొందరు హల్ చల్ చేసేవారు. ఇలాంటివి బాలకృష్ణకు కొత్తకాదు. అయితే అభిమానుల ఒత్తిడితో ఓ సారి బాలయ్య స్వయంగా క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఆ తరువాత బాలయ్యపై నెగటివ్ పబ్లిసిటీ కాస్త తగ్గిన మాట వాస్తవం. బాలయ్య రాజకీయ నాయకుడు కూడా కావడంతో షరా మామూలే అన్నట్టుగా ఆయనపై ట్రోల్స్ సాగుతూనే ఉన్నాయి. 'అఖండ-2' టీజర్ రాగానే పలు మీమ్స్ వెలుగు చూసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న 'అఖండ-2' రిలీజ్ కానుంది. దాంతో బాలయ్య యాంటీ గ్రూప్ డిసెంబర్ 1 నుంచే ఆ సినిమాపై బ్యాడ్ టాక్ స్ప్రెడ్ చేయడానికి ప్లాన్స్ వేస్తోందని సమాచారం.
ఒకప్పుడు బాలకృష్ణ వరుస ఫ్లాపులు చూస్తున్న సమయంలో ఆయనపై ఇలాగే బ్యాడ్ పబ్లిసిటీ చేసేవారు. బాలకృష్ణతో బోయపాటి శ్రీను (Boyapati Srinu) 'సింహా' (Simha) సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. 2010లో రిలీజైన 'సింహా' స్థాయిలో ఆ యేడాది ఏ సినిమా కూడా వసూళ్ళు రాబట్టలేదు. దాంతో 'బాలయ్య ఈజ్ బ్యాక్' అంటూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆ పై బాలయ్య - బోయపాటి కాంబోలో వచ్చిన 'లెజెండ్, అఖండ' చిత్రాలు సైతం బ్లాక్ బస్టర్స్ గా నిలవడంతో ప్రత్యర్థులు చప్పబడ్డారు. అయినా, బాలయ్యకు బోయపాటి తప్ప వేరెవ్వరూ దిక్కులేరనీ కొందరు టముకు వేశారు. ఉన్నట్టుండి 'అఖండ' తరువాత నుంచీ బాలయ్య వరుసగా సక్సెస్ రూటులో సాగుతున్నారు. ఇతర డైరెక్టర్స్ తోనూ గ్రాండ్ సక్సెస్ చూస్తున్నారు. దీంతో బాలయ్యపై నెగటివ్ మీమ్స్ మరింతగా సాగాయి. ఎన్ని చేసినా బాలయ్య సినిమాలు మంచి ఆదరణ పొందుతూ సాగుతున్నాయి.
ముందుగా సెప్టెంబర్ 25న 'అఖండ-2' వస్తుందని ప్రకటించారు. అదే రోజున పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 'ఓజీ' (OG) డేట్ కూడా ఎంచుకున్నారు. పైగా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఈ కోణంలో పవన్ సినిమా 'ఓజీ' ముందుగా రావడానికి బాలయ్య 'అఖండ-2' బరి నుండి తప్పుకుంది. పైకి మాత్రం 'అఖండ-2' ప్యాచ్ వర్క్ ఇంకా ఉందని, అందువల్లే పోస్ట్ పోన్ అయిందని చెప్పుకున్నారు. బాలకృష్ణ స్వయంగా 'ముందు తమ్ముడు పవన్ కళ్యాణ్ వస్తాడు. తరువాత అఖండ ఉంటుందని' చెప్పారు. ఈ నేపథ్యంలో కూటమి మైత్రీబంధాన్ని అభిమానులు సైతం అభినందించారు. అయితే ఈ మధ్య అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు- ఆ తరువాత సాగిన రాద్దాంతం- నేపథ్యంలో బాలయ్య ప్రత్యర్థులు మళ్ళీ మునుపటిలా 'అఖండ-2'ను ట్రోల్ చేసే దిశగా సాగడానికి ప్లాన్ చేస్తున్నారని వినికిడి. సినిమా బాగుంటే ఎంత ట్రోల్ చేసినా అది ప్లస్ అవుతుందే తప్ప మైనస్ కాదని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. పైగా అలా నెగటివ్ పబ్లిసిటీ చేసినా, బాలయ్య 'అఖండ-2'పై నెలకొన్న క్రేజ్ కు ఏ మాత్రం భంగం వాటిల్లదనీ వారు ఆశిస్తున్నారు. ఏమవుతుందో చూద్దాం.
Also Read: Samantha: పండగ పూట.. శుభవార్త చెప్పిన సమంత
Also Read: Tollywood: 'జార్జిరెడ్డి' దర్శకుడితో సాగర్ పాన్ ఇండియా మూవీ