Naga Chaitanya: దక్షగా మీనాక్షి చౌదరి...
ABN, Publish Date - Nov 04 , 2025 | 11:46 AM
నాగచైతన్య కొత్త సినిమాలో మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఆమె ఆర్కియాలజీ సైంటిస్ట్ దక్ష పాత్రను చేస్తోంది.
ప్రముఖ నటి మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కొత్త పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా 'విరూపాక్ష' (Virupaksh) దర్శకుడు కార్తీక్ దండు (Karthik Dandu) ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్. సోమవారమే ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామని నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ తెలిపారు. అయితే చేవెళ్ళ బసు దుర్ఘటనతో దానిని ఈ రోజుకు వాయిదా వేశారు. ఆ ప్రకారంగా మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇంకా పేరు పెట్టని ఈ మిథికల్ థ్రిల్లర్ మూవీలో దక్ష అనే ఆర్కియాలజీ సైంటిస్ట్ పాత్రను మీనాక్షి చౌదరి చేస్తోంది. తాజా విడుదలైన పోస్టర్ చూస్తుంటే... ఈ పాత్ర సినిమాలో చాలా కీలకమైందనేది అర్థమౌతోంది. దర్శకుడు సుకుమార్ సైతం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో 'లాపతా లేడీస్' ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు అజనీశ్ బి. లోకనాథ్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.
Also Read: Ilaiyaraaja: కుమార్తె పేరుతో.. ఇళయరాజా కొత్త ‘ఆర్కెస్ట్రా’
Also Read: Digital Media Federation: డిజిటల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ గా సుమ