Life: మోనాలిసా మూవీ... తొలి షెడ్యూల్ పూర్తి
ABN, Publish Date - Dec 03 , 2025 | 07:00 PM
కుంభమేళా ఫేమ్ మోనాలిసా భోంస్లే హీరోయిన్ గా నటిస్తున్న తెలుగు సినిమా 'లైఫ్'. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయ్యింది.
కుంభమేళా (Kumbh Mela) లో పూసలమ్ముతూ విశాలమైన కనులతో సోషల్ మీడియా ద్వారా అందరినీ ఆకట్టుకున్న మోనాలిసా (Monalisa) తెలుగులో కథానాయికగా మారింది. సాయిచరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు 'లైఫ్' (Life) అనే పేరు పెట్టారు. శ్రీను కోటపాటి దర్శకత్వంలో అంజన్న విరిగినేని నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ 5న మొదలైంది.
తాజాగా 'లైఫ్' సినిమా తొలి షెడ్యూల్ పూర్తయినట్టు మేకర్స్ తెలిపారు. అనుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని, త్వరలోనే రెండో షెడ్యూల్ ను ప్రారంభిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ కథను దర్శకుడు శ్రీను కోటపాటి చెప్పినప్పుడే కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఫేమస్ అయిన మోనాలిసా నటిస్తే బాగుంటుందని అనుకున్నామని, ఆమె కూడా ఈ తెలుగు సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించి, అంగీకరించారని నిర్మాత అంజన్న చెప్పారు. మోనాలిసాకు నటిగానూ ఈ సినిమాతో గుర్తింపు వస్తుందని దర్శకుడు శ్రీను అన్నారు. ఇందులో సయాజీ షిండే, సురేష్, ఆమని, తులసి, రచ్చ రవి ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సుకుమార్ సంగీతం అందిస్తుండగా, మురళీ మోహన్ రెడ్డి డీవోపీగా పనిచేస్తున్నారు.
Also Read: Aadi Pinisetty: 'అఖండ 2' లో విలన్... 'డ్రైవ్' లో హీరో...
Also Read: Samantha: నా జీవితాన్ని నువ్వెంత మార్చావో నీక్కూడా తెలియదు.. సామ్ ఎమోషనల్