Samantha: నా జీవితాన్ని నువ్వెంత మార్చావో నీక్కూడా తెలియదు.. సామ్ ఎమోషనల్
ABN , Publish Date - Dec 03 , 2025 | 06:37 PM
స్టార్ హీరోయిన్ సమంత (Samantha)కు ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ లో సింగర్ చిన్మయి, శిల్పా రెడ్డి (Shilpa Reddy) బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత (Samantha)కు ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ లో సింగర్ చిన్మయి, శిల్పా రెడ్డి (Shilpa Reddy) బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా శిల్పారెడ్డితో సమంత అనుబంధం ఎంతో ప్రత్యేకం. ఫ్యాషన్ డిజైనర్ గా, మోడల్ గా శిల్పాకు చాలా మంచి పేరు ఉంది. సామ్ కి ఫ్రెండ్ అయ్యాక ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. ఇక శిల్పా వచ్చాక సమంత జీవితం మారిపోయింది. సామ్ కు ఎన్నో జీవిత పాఠాలను శిల్పా నేర్పింది.
సామ్ జీవితంలో వచ్చిన కష్టాలు, సంతోషాలు అన్నింటిలో శిల్పా తోడు ఉంది. ముఖ్యంగా చైతో విడాకుల తరువాత సామ్ ఒంటరితనాన్ని దూరం చేసినవాళ్లలో శిల్పా మొదటి స్థానంలో ఉంది అంటే ఆశ్చర్యం లేదు. తన కుటుంబాన్నే సామ్ కుటుంబంగా మార్చింది. బెస్ట్ ఫ్రెండ్స్ అనే పదానికి వీరిద్దరూ బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు అని చెప్పొచ్చు. సామ్ తీసుకొనే ఏ నిర్ణయంలో అయినా కూడా శిల్పా రెడ్డి ఉంటుంది.
ఇక రాజ్ నిడిమోరు పెళ్లి విషయంలో కూడా శిల్పా చెయ్యి ఉందని తెలుస్తోంది. ఈ పెళ్ళిలో ఆమెనే హైలైట్ గా నిలిచింది. పెళ్లి ఫోటోలను శిల్పా సైతం అభిమానులతో షేర్ చేసుకుంది. ఇక ఆ ఫోటోలను సామ్ కూడా షేర్ చేస్తూ.. శిల్పా తన జీవితంలోకి వచ్చాక ఎంత మార్పు వచ్చిందో చెప్పుకొచ్చింది . 'శిల్పా రెడ్డి నువ్వు నా జీవితాన్ని ఎన్ని రకాలుగా మార్చావో అది నీకు కూడా తెలియదు. , నువ్వు నన్ను ధ్యానంలోకి నెట్టిన ఆ 15 నిమిషాలు నా జీవిత గమనాన్ని నిజంగా మార్చాయి. అలాంటి గొప్ప బహుమతిని ఇచ్చినందుకు ధన్యవాదాలు' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.