Mohanbabu: కన్నప్పను వీక్షించిన సాధువులు
ABN, Publish Date - Jul 08 , 2025 | 06:52 PM
కన్నప్ప సినిమాను విజయవాడలో సాధువులు, నాగసాధువులు, యోగినిలు ప్రత్యేకంగా వీక్షించారు. ఈ షోకు నిర్మాత మోహన్ బాబు సైతం హాజరయ్యారు.
ఇటీవల విడుదలైన 'కన్నప్ప' చిత్రం పాజిటివ్ టాక్ తో సాగుతోంది. తాజాగా ఈ సినిమాను గజల్ గాయకుడు, సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ విజయవాడలో ప్రదర్శించారు. స్క్రీనింగ్ అనంతరం చిత్రనిర్మాత, నటుడు మోహన్ బాబు మాట్లాడుతూ, 'కన్నప్ప సినిమాను గొప్పగా ఆదరిస్తున్నారు. ప్రతి చోటా కన్నప్పకి మంచి స్పందన వస్తోంది. విష్ణు నటనను అందరూ కొనియాడుతున్నారు. ఈ రోజు విజయవాడలో సోదరుడు గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో షోను నిర్వహించారు. నాగ సాధువులు, సాధువులు, యోగినిలు, అఘోరాలతో కలిసి మరోసారి సినిమాను వీక్షించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ 'కన్నప్ప’ను వెండితెరపైకి మళ్లీ తీసుకు రావడం ఓ గొప్ప నిర్ణయం. చిత్రం అద్భుతంగా ఉంది. విష్ణు నటన కన్నుల విందుగా అనిపించింది. కన్నప్ప జీవితాన్ని మరోసారి ఇంత గొప్పగా తీసిన నిర్మాత మోహన్ బాబు గారికి ధన్యవాదాలు. సినిమా ఆద్యంతం రోమాంచితంగా ఉంది. సంపూర్ణమైన భక్తి రస చిత్రంగా దీనిని మలిచారు. అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, విష్ణు నటన అందరినీ కదిలించింది. ఈ రోజు నాగ సాధవులు, సాధువులు, మాతాజీలు, యోగినీలు ఎంతో మంది సినిమాను చూసి ఆనందిస్తున్నారు’ అని అన్నారు.
Also Read: Soubin Shahir: రూ.47 కోట్ల మోసం.. మలయాళ అగ్ర నటుడు అరెస్ట్
Also Read: Saif Ali Khan: ఎవరిని నుండి సంక్రమించిన ఆస్తి... ఎలా పోయింది...