Kurnool Bus accident: కర్నూల్ బస్సు ప్రమాదం.. మోహన్‌బాబు విచారం
ABN, Publish Date - Oct 24 , 2025 | 02:56 PM
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై మంచు మోహన్‌బాబు విచారం వ్యక్తం చేశారు. ఇది మాటలకు అందని విషాదమని ఆయన పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై మంచు మోహన్‌బాబు (Mohanbabu) విచారం వ్యక్తం చేశారు. ఇది మాటలకు అందని విషాదమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీ (Bus Fire Accident) కొట్టడంతో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. తాజాగా ఈ ఘటనపై సినీ ప్రముఖులు విచారం వ్యక్తంచేస్తున్నారు. మోహన్‌బాబు ఈ మేరకు ట్వీట్ చేశారు.
‘హైదరాబాద్-బెంగళూరు హైవేపై జరిగిన బస్సు దుర్ఘటన గురించి విని చాలా బాధపడ్డాను. క్షణాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇది మాటలకందని విషాదం. కుటుంబసభ్యులు, సన్నిహితులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని మోహన్‌బాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘బస్సు ప్రమాద ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం’
- మంచు విష్ణు (Mancu Vishnu)
ALSO READ: Bison Review: ధృవ్ విక్రమ్ స్పోర్ట్స్ డ్రామా 'బైసన్' ఎలా ఉందంటే
Vicky Kaushal: ఆలస్యంగా పరశురాముడి ఆగమనం...
Tollywood: సినీ కార్మికుల సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం