Vicky Kaushal: ఆలస్యంగా పరశురాముడి ఆగమనం...

ABN , Publish Date - Oct 24 , 2025 | 02:38 PM

ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ హీరోగా రూపుదిద్దుకోనున్న 'మహావతార్' సినిమా నిర్మాణం మరింత ఆలస్యం కానుంది. వచ్చే యేడాది క్రిస్మస్ కు రావాల్సిన ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. వచ్చే యేడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు అమర్ కౌశిక్ చెబుతున్నారు.

Vicky Kaushal Mahavatar Movie

ఈ యేడాది ఇప్పటి వరకూ విక్కీ కౌశల్ (Vicky Kaushal) నటించిన 'ఛావా' (Chhaava) సినిమానే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని రిషబ్ శెట్టి (Rishabh Shetty) నటించిన 'కాంతార: చాప్టర్ 1' (Kantara: Chapter 1) ఆక్యుపై చేసింది. దాంతో 'ఛావా' రెండోస్థానానికి వెళ్ళిపోయింది. ఇదిలా ఉంటే... 'ఛావా' సినిమాను నిర్మించి మాడ్డాక్ ఫిలిమ్స్ అప్పట్లో 'స్త్రీ -2' (Stree -2) దర్శకుడు అమర్ కౌశిక్ (Amar Kaushik) తో విక్కీ కౌశల్ హీరోగా 'మహావతార్' (Mahavatar) అనే సినిమా నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. దశావతారాల్లో ఒక్కటైన పరశురాముడి గాథను 'మహావతార్'లో చూపించబోతున్నట్టు తెలిపింది. ఆ ప్రకటనతో పాటు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేస్తూ వచ్చే యేడాది 2026లో ఈ సినిమా విడుదల అవుతుందని తెలిపింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం అవుతుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.


పరశురామావతారన్ని బేస్ చేసుకుని రూపుదిద్దుకోబోతున్న 'మహావతార్' మూవీ గురించి దర్శకుడు అమర్ కౌశిక్ ఇటీవల పెదవి విప్పాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆరేడు నెలలుగా జరుగుతోందని తెలిపాడు. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని బాలీవుడ్ లో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెబుతూ, 'ఇది చాలా ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్. దానికి సంబంధించి హోమ్ వర్క్ చాలా ఉంది. కొన్ని నెలలుగా ఆ పనిమీదనే నేను ఉన్నారు. వెపన్స్, సెట్స్ డిజైన్ చేసే పని జరుగుతోంది. ఈ పౌరాణిక గాథలో ఏ పాత్ర ఎలా ఉండాలనే దానిలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. స్క్రిప్ట్ వర్క్ అయితే పూర్తయ్యింది. విక్కీ కౌశల్ తన ఇతర కమిట్ మెంట్స్ ను పూర్తి చేసుకున్న తర్వాత వచ్చే యేడాది మధ్యలో దీనిని పట్టాలెక్కిస్తాం. అందువల్ల ముందు చెప్పినట్టుగా 2026 క్రిస్మస్ కు 'మహావతార్' సినిమా రాదు' అని అన్నారు.


ఈ ప్రాజెక్ట్ గురించి అమర్ కౌశిక్ మాట్లాడుతూ, 'ఇది నాకు ఎంతో ఇష్టమైన సినిమా. నేను అరుణాచల్ ప్రదేశ్ లో స్కూల్ లో చదువుతున్నప్పుడు మాకు దగ్గరలోని పరశురామ్ కుండ్ ఉండేది. పరశురాముడి గురించి మా అమ్మను అడిగితే ఆయనకు చాలా కోపం ఎక్కువ నా చిన్నతనంలో పరశురాముడి గురించి చాలా తక్కువ తెలుసు. , ఎవరినైనా అడిగినా... ఆయనకు ముక్కుమీద కోపం ఉంటుందని మాత్రమే చెప్పేది' అని అన్నారు. పెరిగి పెద్ద అయిన తర్వాత పరశురాముడి జీవితం గురించి తెలుసుకున్న తర్వాత ఆయన పూర్తి స్థాయిలో అర్థమయ్యారని, ఆయనపై సినిమా తీయాలనే కోరిక కలిగిందని అమర్ కౌశిక్ తెలిపారు. ఈ చిత్రానికి వి.ఎఫ్‌.ఎక్స్. వర్క్ కూడా చాలా ఉంటుందని, అందువల్ల కాస్తంత సమయం తీసుకునే దీనిని అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామని అన్నారు.

Also Read: Srikanth Vissa: నందమూరి కళ్యాణ్‌ రామ్ సినిమాతో దర్శకుడిగా...

Also Read: Nara Rohith: సీఎం రేవంత్ రెడ్డికి వివాహ ఆహ్వానం 

Updated Date - Oct 24 , 2025 | 02:38 PM