Mega 156: చిరంజీవి, వశిష్ట సినిమా టైటిల్ ఖరారు, అందుకేనా ఆ పేరు

ABN , First Publish Date - 2023-10-25T15:41:17+05:30 IST

చిరంజీవి, మల్లిడి వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న మెగా 156 సినిమా టైటిల్ ఖరారు అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. 'భూలోకవీరుడు', 'ముల్లోకాల వీరుడు' ఇలాంటివి టైటిల్స్ కొన్ని అనుకున్నారు, కానీ 'వీరుడు' అనే పదం చిరంజీవి పాత సినిమాకి అనుబంధంగా ఉన్నాయని, 'వీరుడు' లేని ఇంకొక టైటిల్ పెట్టారని తెలిసింది.

Mega 156: చిరంజీవి, వశిష్ట సినిమా టైటిల్ ఖరారు, అందుకేనా ఆ పేరు
Mega Star Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి (MegaStarChiranjeevi), దర్శకుడు వశిష్ట (Vasishta) కాంబినేషన్లో వస్తున్న మెగా 156 #Mega156 సినిమా దసరా రోజు అధికారికంగా ప్రారంభం అయింది. ఇది ఒక ఫాంటసీ సినిమా అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా టైటిల్ ముందుగా అనేక పేర్లు వచ్చాయి, అందులో 'భూలోక వీరుడు' అని కూడా అనుకున్నారు. అయితే వీరుడు అని పెడితే అది మళ్ళీ చిరంజీవి పాత సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి' #JagadekaVeeruduAthilokaSundari సినిమాకి సంబంధించింది అని అంటారేమో అని అది వద్దనుకున్నారు అని తెలిసింది.

chiranjeevi-fantasy.jpg

ఎందుకంటే నిర్మాత అశ్విని దత్ (AshwiniDutt) తన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' #JVAS సినిమా నుండి ఎటువంటి, పాట, మాట, సన్నివేశం, సంగీతం, పేరు ఏమీ ఎవరూ వాడకూడదు ఆమధ్య ఒక ప్రకటన ఇచ్చారు కదా. అది ఈ చిరంజీవి, వశిష్ట సినిమా గురించి ఇచ్చినదే అని పరిశ్రమలో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాకి, ఆ సినిమాకి ఎటువంటి సంబంధం లేదని, అసలు ఒక్క సన్నివేశం కూడా కలవాడు అని వసిష్ఠ బృందం చెపుతోంది.

ఆందులో భాగంగా ఈ చిత్రానికి 'విశ్వంభర' #Viswambhara అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో ముగ్గురు కథానాయికలు ఉంటారని, అందులో ఒకరు అనుష్క శెట్టి (AnushkaShetty) అని కూడా అంటున్నారు. మిగతా ఇద్దరు బాలీవుడ్ కి చెందిన కథానాయికలుగా చెపుతున్నారు. ఇందులోనే రానా దగ్గుబాటి (RanaDaggubati) విలన్ గా నటిస్తున్నాడని కూడా చెపుతున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది అని తెలిసింది.

Updated Date - 2023-10-25T15:41:17+05:30 IST