Vijay Devarakonda: ఆ యాప్స్ లీగల్.. అందుకే ప్రమోట్ చేశా

ABN , Publish Date - Aug 06 , 2025 | 04:53 PM

ఈడీ విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్ (Betting App) కేసులో నేడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే.

Vijay Devarakonda

Vijay Devarakonda: ఈడీ విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్ (Betting App) కేసులో నేడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. నాలుగు గంటల పాటు జరిగిన ఈ విచారణలో ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు విజయ్ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఇక విచారణ అనంతరం విజయ్ మీడియా ముందు మాట్లాడుతూ.. ' నన్ను పిలిచింది ఇల్లిగిల్ యాప్స్ కేసులో కాదు.. గేమింగ్ యాప్ క్లారిఫికేషన్ కోసం పిలిచారు. హెడ్ లైన్స్ లో అవి మార్చండి. బెట్టింగ్ యాప్ ఇన్వేస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది. ఈ విచారణలో నా పేరు ఎందుకు వచ్చిందో వారికి కూడా తెలియదు.


నన్ను పిలిచింది గేమింగ్ యాప్స్ కోసం. బెట్టింగ్ యాప్స్ కు, గేమింగ్ యాప్స్ కు అసలు సంబంధం లేదు. గేమింగ్ యాప్స్ అనేవి పూర్తిగా లీగల్.. ప్రభుత్వం నిర్వహించేవి. లైసెన్స్ కూడా ఉంటుంది. వారికి జిఎస్టీలు, టిఎస్టీడిలు అన్ని ఉంటాయి. అలాంటి గేమింగ్ కంపెనీనే A23. నేను ఆ కంపెనీనే ప్రమోట్ చేశాను. అది లీగల్. ఈ బెట్టింగ్ యాప్స్ కు నాకు సంబంధం లేదు. కానీ, నా పేరు వచ్చింది కాబట్టి వచ్చి వాళ్లు అడిగిన డిటైల్స్ ఇచ్చాను. A23 తెలంగాణలో ఓపెన్ కాదు. ఇక్కడ మీరు ఓపెన్ చేయలేరు అని మెసేజ్ వస్తుంది. లీగల్ గా ఉన్న గేమ్స్ ను మాత్రమే నేను ప్రమోట్ చేశాను' అంటూ చెప్పుకొచ్చాడు.

Karan Johar: బాలీవుడ్ బడా నిర్మాత పనైపోయిందా..

Pushpa Stampede: అల్లు అర్జున్ పుష్ప 2 తొక్కిసలాట.. NHRC సీరియస్‌

Updated Date - Aug 06 , 2025 | 04:53 PM