Meena Sagar: భర్త చనిపోయిన వారానికే రెండో పెళ్లి.. మీనా ఏం చెప్పిందంటే
ABN, Publish Date - Sep 15 , 2025 | 04:04 PM
బాలనటిగా కెరీర్ ను ప్రారంభించి హీరోయిన్ గా మారి, స్టార్ హీరోయిన్ గా ఎదిగి.. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ తో బిజీగా మారింది మీనా సాగర్ (Meena Sagar).
Meena Sagar: బాలనటిగా కెరీర్ ను ప్రారంభించి హీరోయిన్ గా మారి, స్టార్ హీరోయిన్ గా ఎదిగి.. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ తో బిజీగా మారింది మీనా సాగర్ (Meena Sagar). చిన్నతనం నుంచి ఇప్పటివరకు మీనాలో అదే ఎనర్జీ. స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలోనే బెంగుళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ను వివాహం చేసుకొని కొన్నేళ్లు ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తరువాత మీనా కూతురు కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తేరి సినిమాలో బాలనటిగా మీనా కూతురు నైనికా నటించి మెప్పించింది.
అంతా బావుంది అనుకొనేలోపు మీనా జీవితాన్ని దేవుడు అతలాకుతలం చేశాడు. అనారోగ్యంతో మీనా భర్త సాగర్ మరణించాడు. దీంతో మీనాజీవితం అగమ్యగోచరంగా మారింది. ఇక ఆ సమయంలో మీనాపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. భర్త మరణించిన వారానికే రెండో పెళ్లి చేసుకుంటుంది అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అంతేకాకుండా అప్పుడే విడాకులు అయిన ధనుష్ తో మీనా పెళ్లి అంటూ వార్తలు పుట్టించారు. ఇక ఈ పుకార్లపై మీనా ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది. తాజాగా ఆమె జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు గెస్ట్ గా వచ్చింది. ఈ షోలో మీనా ఈ పుకార్లపై స్పందించింది.
' అది చాలా షాకింగ్. ఆయన మరణించాకా రెండేళ్లు చాలా చాలా కష్టంగా గడిచాయి. ఎంతో బాధను అనుభవించాను. అందులో నుంచి బయటపడడం పెద్ద టాస్క్. నిజంగా అలాంటప్పుడు మన పక్కన ఉన్న స్నేహితులే చాలా గొప్పవారు. మంచిగా ఉన్నప్పుడు అందరూ ఉంటారు. ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు మన పక్కన ఉన్నవారే అసలైన స్నేహితులు. నాకు అలాంటివారు ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. సింగిల్ గా ఉండడం వేరు. సింగిల్ మదర్ గా ఉండడం వేరు. కొన్నిసార్లు సోషల్ మీడియా కొద్దిగా పాజిటివ్ గా ఉంటే బావుండు అనిపించింది.
నా భర్త చనిపోయి వారం కూడా కాలేదు. అప్పుడే అసలు ఏమైందో అని నేనే చాలా షాక్ లో ఉన్నా. న్యూస్ లో చూస్తే మీనా రెండో పెళ్లి చేసుకుంటుంది అని వచ్చింది. అసలు నాకేం అర్ధం కాలేదు. ఏంటిది.. వీళ్లకసలు ఫ్యామిలీ ఉండదా.. ? ఎందుకు వీరు ఇలా చేస్తున్నారు అని నిజంగా బాధేసింది. ఆ తరువాత ఎవరు విడాకులు తీసుకున్నా వారితో మీనా పెళ్లి అని రాయడం మొదలుపెట్టారు. ఎందుకు ఇలా చేస్తున్నారు. మీడియా అనేది చాలా పవర్ ఫుల్ మీడియం. అందులో అంత నెగిటివిటీ ఎందుకు. నాకర్థం కావడం లేదు' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Prabhas: కేరళలో 'రాజాసాబ్' ఆటాపాటా
Dhanush: 'ఇడ్లీ కొట్టు' నుంచి మాంచి మెలోడీ సాంగ్ వచ్చేసింది