Dhanush: 'ఇడ్లీ కొట్టు' నుంచి మాంచి మెలోడీ సాంగ్ వచ్చేసింది
ABN, Publish Date - Sep 15 , 2025 | 03:41 PM
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) కుబేరతో ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న చిత్రాల్లో ఇడ్లీ కొట్టు (Idly Kottu) ఒకటి. ధనుష్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆకాష్ బాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిత్యా మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 1న రిలీజ్ కానుందని తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి కొత్తగుందే అంటూ సాగే చక్కని మెలోడీ సాంగ్ ను విడుదల చేశారు. జీవి ప్రకాష్ సంగీతంలో కృష్ణ తేజస్వి, శ్వేతా మోహన్ ఆలపించిన ఈ పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Updated at - Sep 15 , 2025 | 03:41 PM