Prabhas: కేరళలో 'రాజాసాబ్' ఆటాపాటా
ABN , Publish Date - Sep 15 , 2025 | 03:48 PM
మొన్నటి దాకా ఆ హీరో నుంచి అప్ డేట్స్ లేవు. వరుస మూవీలతో బిజీగా ఉన్నప్పటికీ అసలు అలికిడి లేకుండా ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు గ్యాప్ లేకుండా అప్డేట్స్ ఇచ్చేస్తున్నాడు. అభిమానులలో జోష్ ను డబుల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) 'ది రాజాసాబ్’' (Raja saab) తో థియేటర్లను షేక్ చేయడానికి పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నాడు. మారుతి (Maruthi) దర్శకత్వంలో రొమాంటిక్ హారర్ కామెడీ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫైనల్ రౌండ్‌లో ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతోంది. సెప్టెంబర్ 20 నుంచి వారం రోజుల పాటు కేరళ (Kerala) లోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో కొత్త షెడ్యూల్ మొదలు కాబోతోంది. దీనికి ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందిస్తాడట. ఈ రొమాంటిక్ డ్యాన్స్ నంబర్ కు తమన్ అద్భుతమైన ట్యూన్ చేశాడట. ఈ పాటను ప్రభాస్ తో పాటు హీరోయిన్ పై చిత్రీకరించ బోతున్నట్టుగా సమాచారం. ఈ సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది.
ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ను రూల్ చేస్తున్నాడు. ‘కన్నప్ప’ (Kannappa)లో రుద్ర (Rudhra) గా గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చిన ప్రభాస్, ‘ది రాజాసాబ్’లో డబుల్ రోల్ పోషిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ పెర్ఫార్మెన్స్ మరో లెవల్ లో ఉండబోతోందట. ఇటీవల రిలీజైన గ్లింప్స్‌లో ప్రభాస్ స్టైలిష్ లుక్, తమన్ బీజీఎం, విజువల్ ట్రీట్ అభిమానులను ఊపేస్తున్నాయి. ఇక వచ్చే నెలలో గ్రీస్‌లో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. అక్కడ రెండు సాంగ్స్ ను షూట్ చేయనున్నారు.
తమన్ (Thaman) సంగీతం ఈ సినిమాకి బిగ్ అసెట్ కానుంది. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి తగ్గట్టుగా మాస్ బీట్స్, రొమాంటిక్ వైబ్స్‌తో సౌండ్ ట్రాక్‌ను రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి స్పెషల్‌గా 2026 జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దానికి ముందు చాలా సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. ఇది ఫ్యాన్స్‌కి ఫుల్ జోష్ ఇవ్వనుంది. అదే టైంలో ‘కాంతార చాప్టర్ 1’ (Kantara: Chapter1) రిలీజ్ సమయంలో ‘ది రాజాసాబ్’ ట్రైలర్‌ను థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో వరుస అప్‌డేట్స్‌తో ప్రభాస్ ఫ్యాన్స్‌కు కిక్కెక్కించేందుకు చిత్ర బృందం రెడీ అవుతోంది.
Read Also: Tollywood: టాలీవుడ్‌కు.. కొత్త కళ
Read Also: Sunny Sanskari Ki Tulsi Kumari: జాన్వీ కపూర్.. కొత్త సినిమా ట్రైలర్ అదిరింది