Mana Shankaravaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్‌గారు’ మరో అప్‌డేట్ వచ్చేసింది
ABN, Publish Date - Sep 05 , 2025 | 05:30 PM
సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న‘మన శంకర వరప్రసాద్‌గారు’శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
చిరంజీవి (Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ (Mana Shankaravaraprasad Garu) . సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. నయనతార కథానాయిక. ఇటీవల చిరు పుట్టిన రోజు సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్స్ ఇచ్చారు. చిరు లుక్, గింప్స్‌కు వచ్చిన స్పందనతో టీమ్ మరింత జోష్ మీదుంది. తాజాగా మరో అప్‌డేట్ షేర్ చేశారు. నిర్మాత సాహు గారపాటి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాజా షెడ్యూల్ గురించి చెప్పారు. అలాగే అక్టోబర్ 5 నుంచి నిర్వహించనున్న మరో షెడ్యూల్‌లో వెంకటేశ్ పాల్గొంటారని చెప్పారు.
Also Read: Ghaati Review: అనుష్క నటించిన యాక్షన్ డ్రామా 'ఘాటీ' మెప్పించిందా!?
గత నెలలో కేరళలో షెడ్యూల్ పూర్తి చేసుకుందీ సినిమా. తాజాగా మరో షెడ్యూల్‌ను మొదటుపెట్టారు. శుక్రవారం నుంచి సెప్టెంబర్ 19 దాకా చిత్రీకరణ జరగనుంది. ఇందులో రెండు పాటల చిత్రీకరణ ఉన్నట్లు టీమ్ తెలిపింది. ఆ పాటలు కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని పేర్కొన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకులకు, అభిమానులకు పెద్ద ట్రీట్ ఇవ్వబోతోందని తెలిపారు. ఈ సినిమాతోపాటు వచ్చే ఏడాది సమ్మర్‌లో విశ్వంభరతో సందడి చేయనున్నారు చిరు. వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ సినిమాగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో చిరు సరసన త్రిష కనిపించనున్నారు.
Also Read: Little Hearts Review: 'లిటిల్ హార్ట్స్' మూవీ ఎలాదంటే...