Sai Durga Tej: మా ముగ్గురు మావయ్యలకు ధ్యాంక్స్...
ABN , Publish Date - Oct 15 , 2025 | 06:18 PM
సాయి దుర్గ తేజ్ బర్త్ డే సందర్భంగా ఎస్.వై.జి. మూవీ నుండి అసుర ఆగమన గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేశారు. రోహిత్ కె.పి. డైరెక్షన్ లో ఈ పాన్ ఇండియా మూవీని 'హనుమాన్' నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ఎస్.వై.జి.' (సంబరాల యేటి గట్టు). రోహిత్ కె.పి. దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా నుండి సాయి దుర్గ తేజ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ అసుర ఆగమన గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ, 'నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణం మా ముగ్గురు మావయ్యలు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ గార్లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇక ఈ సినిమా విషయానికి వస్తే దీని కోసం నా సర్వస్వం ధారపోశాను. అద్భుతమైన క్వాలిటీతో దీనిని మీకు ఇవ్వాలని చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. నా 'విరూపాక్ష'కు సంగీతం అందించిన అజనీశ్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నాడు. సినిమా అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది. మీ అందరూ దీనిని చూసి ఎంజాయ్ చేస్తారు. అది నా ప్రామిస్' అని అన్నారు.
ఈ సినిమా కోసం సాయి దుర్గ తేజ్ ఎంతో కష్టపడుతున్నాడని, దానికి తగ్గ ప్రతిఫలాన్ని ప్రేక్షకులు సక్సెస్ రూపంలో ఇస్తారనే నమ్మకం ఉందని నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సాయి దుర్గ తేజ్ బౌన్స్ బ్యాక్ అయిన తీరు అందరికీ ఇన్సైరింగ్ గా ఉంటుందని, తనకిది మొదటి సినిమా అయినా నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను తీస్తున్నారని దర్శకుడు రోహిత్ చెప్పాడు. ఈ కార్యక్రమంలో దర్శకులు దేవా కట్ట, వశిష్ఠ, వి.ఐ. ఆనంద్, నిర్మాత వివేక్ కూచిబొట్ల తదితరులు పాల్గొని, చిత్ర బృందానికి, సాయి దుర్గ తేజ్ కు అభినందనలు తెలిపారు. దర్శకుడు రోహిత్ విజన్ ను తెర మీదకు తీసుకురావడానికి తమ టీమ్ మొత్తం ఎంతో కష్టపడుతోందని డీవోపీ పళని స్వామి చెప్పారు.
Also Read: Kollywood: తమిళంలో దీపావళికి యంగ్ హీరోస్ మధ్య వార్...
Also Read: Ram Pothineni: రామ్ పోతినేని ఎఫైర్.. జగ్గూభాయ్ ఏంటి అంత మాట అనేశాడు