Ram Pothineni: రామ్ పోతినేని ఎఫైర్.. జగ్గూభాయ్ ఏంటి అంత మాట అనేశాడు
ABN , Publish Date - Oct 15 , 2025 | 05:13 PM
ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni).. ప్రస్తుతం ఆంధ్రా కింగ్ తాలూకా (Andhra King Taluka) సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు.
Ram Pothineni: ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni).. ప్రస్తుతం ఆంధ్రా కింగ్ తాలూకా (Andhra King Taluka) సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు. మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వచ్చే నెల ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. దీంతో ఇప్పటినుంచే రామ్ ప్రమోషన్స్ మొదలు పెట్టాడు.
ప్రమోషన్స్ లో భాగంగా రామ్.. జగపతిబాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు గెస్ట్ గా వెళ్లాడు. ఇక జగ్గూభాయ్ నిజాయితీ గురించి అందరికీ తెల్సిందే. మనసులో ఏది అనుకుంటాడో అదే చెప్పేస్తాడు. ఈ షోలో కూడా వచ్చిన గెస్టులను ఫిల్టర్ లేకుండా ఘాటు ప్రశ్నలు వేసి షాకులకు గుర్తిచేస్తూ ఉంటాడు. తాజాగా రామ్ ని కూడా అలాంటి ప్రశ్నలే సంధించి శాఖ ఇచ్చాడు.
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో రామ్ ఒకడు. హీరోలు అన్న తరువాత హీరోయిన్లతో ప్రేమాయణాలు బాగానే ఉంటాయి. లేకపోయినా రూమర్స్ మాత్రం గట్టిగా వినిపిస్తాయి. ఎప్పటికప్పుడు రామ్ పెళ్లి గురించే సోషల్ మీడియాలో రచ్చ జరుగుతూ ఉంటుంది. ఇక జగ్గుభాయ్ కూడా ఈ షోలో రామ్ లవ్ లైఫ్ గురించి మాట్లాడాడు. ' నువ్వు అపార్ట్మెంట్ లో సోలోగా ఉంటున్నావ్.. ఎఫైర్ అయితే గ్యారెంటీగా ఉండే ఉంటుంది. కొద్దికొద్దిగా వినిపిస్తున్నాయి' అని జగపతి అడగ్గగానే.. రామ్ సిగ్గుపడుతూ.. ' లవ్ అనండి ఓకే.. మరీ ఎఫైర్ ఏంటి ' అంటూ నవ్వేశాడు.
ఇక ఆ తరువాత ఒక్క అమ్మాయిని పడేయడానికి చాలా కష్టాలు పడినట్లు చెప్తూనే.. చాలామందిని తన వెంట తిప్పుకున్నట్లు రామ్ చెప్పుకొచ్చాడు. ఇక దానికి జగ్గు భాయ్.. హీరోయిన్లతో బాగా ఆడుకున్నావ్ అంటూ ఆటపట్టించాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింటవైరల్ గా మారింది. అయితే రామ్.. లవ్ లో ఉన్నాడు అని ఒప్పుకున్నట్లే అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఏంటి జగ్గూభాయ్ ఎఫైర్ అని అంత పెద్ద మాట అనేసావ్.. అని చెప్పుకొస్తున్నారు.
గత కొన్నిరోజులుగా రామ్.. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో లవ్ లో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు విడివిడిగా పోస్ట్ చేయడం, ఒకరి గురించి ఒకరు ప్రేమ కవితలు చెప్పుకోవడం తో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, జగపతి కూడా ఇదే విషయం వినిపిస్తుంది అని చెప్పినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా రామ్ - భాగ్యశ్రీ జంట మాత్రం చూడముచ్చటగా ఉంటుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Kiran Abbavaram: పవన్ కళ్యాణ్ ను వాడుకుంటున్నాననుకుంటారు
Bollywood: మహాభారత్ కర్ణుడి కన్నుమూత